Business

ఇకపై బ్యాంకులు వారానికి 5 రోజులే!

ఇకపై బ్యాంకులు వారానికి 5 రోజులే!

దేశంలోని ప్రభుత్వ బ్యాంకులు, ఉద్యోగులకు వారానికి 5 రోజులే పని దినాలు అమల్లోకి రానున్నాయి. దీనిపై కేంద్రం ఆర్థిక శాఖ త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనుందని తెలుస్తోంది. ఈ పద్ధతి అమల్లోకి వస్తే పని దినాల్లో ఉద్యోగులు రోజుకు 40 నిమిషాలు అధికంగా పనిచేయాల్సి ఉంటుంది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ), యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయిస్(యూఎఫ్బఈ) ఇప్పటికే ఈ విధానానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి.