DailyDose

దుర్గగుడి ఈవో భ్రమరాంబ అవినీతిపై విచారణ చేయాలి

దుర్గగుడి ఈవో భ్రమరాంబ అవినీతిపై విచారణ చేయాలి

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేసిన దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు

ఇంద్రకీలాద్రి మే 5
దుర్గగుడి ఆలయ ప్రతిష్ట భక్తుల మనోభావాలు భంగం కలిగించే రీతిలో ఈ ఓ భ్రమరాంబ వ్యవహరిస్తున్నారని ఏసీబీ అధికారులుకు పట్టుబడిన నగేష్ ను ప్రోత్సహించిన భ్రమరాంబ అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కు దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు
ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో అతిపెద్ద రెండో దేవాలయం రాజధాని విజయవాడ ప్రాంతంలో ఉన్న దుర్గగుడి కి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారని భక్తుల మనోభావాలు ఆగమ శాస్త్ర విరుద్ధంగా వ్యవహరిస్తూ భ్రమరాంబ ప్రభుత్వ ప్రతిష్ట భక్తుల మనోభావాలు అమ్మవారి ఆలయ ఖ్యాతి కి బంగం కలిగించే రీతి లో
భ్రమరాంబ వ్యవహరిస్తున్నారని ఆలయంలో అవినీతి కార్యకలాపాలకు సూత్రధారి ఈ ఓ అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కు ఆలయ చైర్మన్ కర్నాటి రాంబాబు ఫిర్యాదు చేశారు.
ఏసీబీ అధికారులకు పట్టుబడిన నగేష్ , ఈవో భ్రమరాంబకు కుడి భుజంగా వ్యవహరించే వారిని అవినీతి ఆరోపణలు వచ్చిన ఉద్యోగులపై నగేష్ చేత విచారణ చేసే విధంగా భ్రమరాంబ ఆదేశాలు జారీ చేసిన తీరు స్వయంగా వివరించి రాంబాబు ఫిర్యాదు చేయడం జరిగింది.
ఈవో భ్రమరాంబ హయాంలో చోటుచేసుకున్న నియామకాలు
భారీ అవకతవకులు అక్రమాలు చోటుచేసుకున్నాయని వివరించారు.
భ్రమరాంబ టెండర్లు విషయంలో అవినీతికి పాల్పడినట్లు ఆలయ అభివృద్ధి పనులు పేరిట జరుగుతున్న ఇంజనీరింగ్ పనులు భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయని సూత్రధారి భ్రమరాంబ అని ఫిర్యాదు చేశారు.
అమ్మవారి ఆలయ ప్రతిష్ట, ఆగమ శాస్త్ర విరుద్ధంగా భ్రమరాంబ వ్యవహరిస్తున్న తీరు పై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. దుర్గగుడి ఈవో భ్రమరాంబ పై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో విచారణ చేపట్టి అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.