Food

కెమికల్స్ తో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి

కెమికల్స్ తో  పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి

ఎండాకాలం రాగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేవి మామిడిపండ్లే. ఎంతో రుచిగా ఉండే ఈ పండు కోసం చిన్నా, పెద్దా.. తేడా లేకుండా ఎంతగానో ఎదురుచూస్తారు. అయితే, త్వరగా కాయలు పండ్లు కావాలనే ఉద్దేశ్యంతో కొంతమంది కెమికల్స్తో పండిస్తున్నారు. కాగా, చెట్లపై పండాల్సిన మామిడిపండ్లు రసాయనాలతో పక్వానికి వస్తున్నాయి. దీంతో ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. ఇంతకీ మార్కెట్లో అమ్మే మామిడి పండ్లు సహజమైనవా? రసాయనాలతో పండించినవా ఎలా గుర్తించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

* సహజంగా పండే మామిడి పండ్ల కంటే కృత్రిమంగా పండ్లే ఎక్కువగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

* రసాయనాలతో పండించిన పండ్లలో పండుపై అక్కడక్కడ మచ్చలు కనిపిస్తాయి.

* అలాగే మామిడి పండు సైజ్ చిన్నగా ఉంటుంది.

* ఇలా పండించిన పండ్లలో ఎక్కువ భాగం రసమే ఉంటుంది.

*వీటిని తినడానికి కట్ చేసినప్పుడు ఎరుపు, పసుపు కలిగిన ప్రకాశవంతమైన రంగులో ఈ పండు గుజ్జు కనిపిస్తుంది.

* సహజంగా పండిన మామిడిపండ్లలో గుజ్జు, రసం ఎక్కువగా ఉంటుంది.

* అలాగే కెమికల్స్ పండనది తీపి తక్కువగా ఉంటుంది.

* తెలుపు రంగు, నీలం రంగు మచ్చలున్న మామిడి పండ్లను అస్సలు కొనవద్దు.

* మామిడి పండ్లు కొనడానికి ముందు ఒక పండు తీసుకొని దాన్ని వాటర్ ఉన్న బకెట్ లో వేయండి.

*మామిడి పండు మునిగితే సహజమైనదిగా, పైకి తేలితే రసాయనాలతో పండినట్లుగా గుర్తించండి. కెమికల్స్ కూడిన ఈ రకమైన మామిడి పండ్లను కొనకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి