DailyDose

TNI. నేటి తాజా వార్తలు..

TNI. నేటి తాజా వార్తలు..

* ఏపీ హైకోర్టు:

అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడానికి గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లకు భూమి బదిలీ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 45 పై హైకోర్టులో సవాల్ చేస్తూ
మద్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్ కొట్టేసిన హైకోర్టు

అదనపు AG పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదంతో ఏకీభవించిన హైకోర్టు

పిటిషన్ విచారణ సందర్భంగా ప్రశాంత్ కుమార్ మిశ్రా కీలక వ్యాఖ్యలు

రాజధాని ఏ ఒక్కరికో….. ఒక వర్గానికి పరిమితం కాదు

రాజధాని ప్రజలంది

రాజధాని లో పేదలు ఉండకూడదు అంటే ఎలా అంటూ పిటిషన్లను ప్రశ్నించిన ధర్మాసనం

రాజధాని ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం అభివృద్ధిలో భాగమే

ఫలానా వారికి ఇళ్ళ స్థలాలు ఇవ్వొద్దని చెప్పడం కరెక్ట్ కాదు

రాజధాని భూములు ప్రస్తుతం సి ఆర్ డి ఏ తప్పా… భూములు ఇచ్చిన వారివి కాదు

ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం పైన కోర్టును ఆశ్రయిస్తున్నారు

నిర్ణయాలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని నిరోధించలేం

నిర్ణయాలు తీసుకోవటం ప్రభుత్వ విధుల్లో భాగం

* Shri Bandaru Dattatraya Hon’ble Governor of Haryana participated at 2567th Buddha Jayanthi Celbrations at Gowthama Buddha Statue on 5th May, 2023 at Gibraltar Rock, Tankbund, Hyderabad – Kailas Nagesh Private Secretary to Governor of Haryana

* రేపు సుప్రీంకోర్టుకు అమరావతి రాజధాని రైతులు

– సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయం

* తూర్పుగోదావరి జిల్లా : కడియం చేరుకున్న చంద్రబాబునాయుడు… పంట పొలాలను పరిశీలించిన చంద్రబాబు.. తడిసిన ధాన్యాన్ని పరిశీలించి.. రైతుల నుంచి సమస్యలు తెలుసుకుంటున్న చంద్రబాబు
#Chandrababu #Kadiyam

* రేపు ఉదయం 11 గంటలకు 10 వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల

ఫలితాలు విడుదల చేయనున్నా విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

* హైదరాబాద్

◻️నాంపల్లి సీబీఐ కోర్టులో లొంగిపోయిన ఎర్ర గంగిరెడ్డిని చంచల్ గూడా జైలుకు తరలించిన అధికారులు.

◻️వైఎస్‌ వివేకా కేసులో ఏ-1 గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసి కోర్టులో లొంగిపోవాలని గతంలో ఆదేశించిన హైకోర్టు

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన నెల్లూరు మాజీ జెడ్పీ ఛైర్మన్, టీడీపీ నేత బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి

బొమ్మిరెడ్డితో పాటు వైఎస్‌ఆర్‌సీపీలో చేరిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మాజీ మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్, టీడీపీ నేత ఇందూరు వెంకటరమణా రెడ్డి

హాజరైన ఎమ్మెల్యేలు మేకపాటి విక్రమ్‌ రెడ్డి, వరప్రసాద్, వైఎస్సార్‌సీపీ వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి.

* వైఎస్సార్ కళ్యాణమస్తు.. వైయస్సార్ షాదీ తోఫా: నగదు జమ చేసిన సీఎం జగన్

అమరావతి: పేద కుటుంబాల్లో చెల్లెమ్మల వివాహాలకు అండగా నిలిచే వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా పథకాల కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ బటన్‌ నొక్కి ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ మేరకు జనవరి–మార్చి త్రైమాసికంలో పెళ్లి చేసుకున్న 12,132 మంది లబ్ధిదారులకు రూ.87.32 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించారు. ఇప్పుడు అందిస్తున్న సాయంతో కలిపి గత ఆరు నెలల్లోనే ఈ పథకాల కింద 16,668 మంది లబ్ధిదారులకు మేలు జరిగింది. వీరి ఖాతాల్లో ప్రభుత్వం ఏకంగా రూ.125.50 కోట్లు జమ చేసింది.

ఈ సందర్బంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. కళ్యాణమస్తు అర్హతకు పదో తరగతి చదివి ఉండాలని నిబంధన తీసుకొచ్చాం. ఈ క్రమంలో కనీసం పదో తరగతి అయిన పేద పిల్లలు చదువుకుంటారు. టెన్త్‌ కచ్చితంగా చదివి ఉంటేనే కల్యాణమస్తు, షాదీ తోఫా సాయం అందుతుంది. ఇలా, టెన్త్‌ చదివించాలనే తపన ప్రతీ కుటుంబంలో మొదలవుతుంది. ఈ పథకాలకు అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు కనీస వయసు నిర్ధారించాం.

18 ఏళ్ల నిబంధన వల్ల చదువులు ముందుకు సాగుతాయి. కనీసం డిగ్రీ వరకు చదివే వెసులుబాటు ఉంటుంది. చదువులతోనే ప్రతీ పేద కుటుంబం ఉన్నత స్థాయిలోకి వస్తుంది. విద్యాదీవెన, వసతి దీవెన ఉండటం వల్ల కనీసం డిగ్రీ వరకు చదువుతారు. డిగ్రీ వరకు పిల్లల చదవుల భారం ప్రభుత్వమే భరిస్తుంది. అమ్మఒడి మరో ప్రోత్సాహకరంగా ఉంటుంది అని తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌తో లబ్ధిదారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో మా కుటుంబాల్లో వెలుగులు వచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు.

 

* దక్షిణ తూర్పు బంగాళాఖాతంలో పొంచి ఉన్న తుఫాను ముప్పునకు సమాచారం

రేపు 6 తేదిన శ్రీలంక వద్ద అల్పపీడనం ఏర్పడి..

7న తేదిన అల్పపీడనం మారుతుంది..

8 న వాయుగుండం గా..

9 న తుఫాన్ గా ఉత్తర దిశగా తీరానికి చేరువవుతుంది..

ఏ తీరానికి చేరువవుతుందో..

7 తేదిన సృష్టంగా తెలుస్తుంది.

ఒరిస్సాలో గోపాలపురం తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది.
ఈనాడు వెబ్ సైట్ సౌజన్యంతో