NRI-NRT

అరుదైన రికార్డు సాధించిన అమెరికా వైద్యులు

అరుదైన రికార్డు సాధించిన అమెరికా వైద్యులు

అమెరికా వైద్యులు అరుదైన రికార్డు సృష్టించారు. తల్లి గర్భంలోని శిశువు మెదడుకు విజయవంతంగా చికిత్స చేశారు. ప్రపంచంలో ఇలాంటి ఆపరేషన్ జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. బోస్టన్‌లోని పిల్లల ఆసుపత్రిలో ఈ శస్త్రచికిత్స జరిగింది. వివరాల్లోకి వెళ్తే సాధారణ వైద్యపరీక్షల్లో భాగంగానే తల్లిగర్భంలోని 30 వారాల శిశువు మెదడులో సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

అమెరికా వైద్యులు అరుదైన రికార్డు సృష్టించారు. తల్లి గర్భంలోని శిశువు మెదడుకు విజయవంతంగా చికిత్స చేశారు. ప్రపంచంలో ఇలాంటి ఆపరేషన్ జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. బోస్టన్‌లోని పిల్లల ఆసుపత్రిలో ఈ శస్త్రచికిత్స జరిగింది. వివరాల్లోకి వెళ్తే సాధారణ వైద్యపరీక్షల్లో భాగంగానే తల్లిగర్భంలోని 30 వారాల శిశువు మెదడులో సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మెదడులో అరుదైన రక్తనాళాల సమస్యగా తేల్చారు. అయితే ఈ సమస్య వల్ల బాధపడే శిశువు గుండె వైఫల్యం లేదా మెదడు దెబ్బతినడం లాంటిది జరుగుతుంది. అయితే చాలావరకు ఇలాంటి కేసుల్లో శిశువు జీవించడం అరుదు.

మెదడు నుంచి గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలు సరిగా అభివృద్ధి చెందకపోవడంతో ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఈ సమస్యతో జన్మించిన వారిలో 50 నుంచి 60 శాతం మంది వెంటనే అనారోగ్యానికి గురవుతారు. శిశువు పుట్టగానే మెదడు, గుండె దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇలాంటి సమస్యతో 40 శాతం మంది చనిపోయే అవకాశం ఉంటుందని బోస్టన్‌ పిల్లల ఆసుపత్రి వైద్యనిపుణులు పేర్కొన్నారు. ఆ తల్లి గర్భంలో ఉన్న శిశువును ఎలాగైనా కాపాడాలని వైద్య బృందం నిర్ణయించుకుంది. 34 వారాలు ఉన్న గర్భస్థ శిశువుకు శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. కొద్దిరోజుల తర్వాత బిడ్డ జన్మించిందని, పూర్తిస్థాయి ఆరోగ్యంగా ఉందని పేర్కొన్నారు.