NRI-NRT

జూలై 9న తానా మహాసభలకు వస్తున్న ఇళయరాజా..

జూలై 9న తానా మహాసభలకు వస్తున్న ఇళయరాజా..

ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజా అమెరికాలో జరుగుతున్న తానా మహాసభలకు హాజరవుతున్నారు. మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి ఈరోజు ఇళయరాజా ను కలిసి ఆహ్వానం అందించారు. జులై 9వ తేదీ మహాసభల ఆఖరి రోజున ఇళయరాజా తన బృందంతో సంగీత విభావరి నిర్వహించి ప్రేక్షకులను ఉర్రూతలూగించనున్నారు. మహాసభల ముగింపు సందర్భంగా గ్రాండ్ ఫినాలే కార్యక్రమం క్రింద ఇళయరాజా ప్రదర్శన ఉండబోతోంది..