DailyDose

TNI. నేటి నేర వార్తలు..

TNI. నేటి నేర వార్తలు..

* తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తీరుగూడెంలో హుటాహుటిన తరలిస్తున్న తడిసిన ధాన్యం.

టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రాకతో కదిలిన యంత్రాంగం.
గత రాత్రి నుండి రైతులను మభ్యపెడుతూ ధాన్యాన్ని రైస్ మిల్లులకు తోలుతున్న వైనం.

నిన్నటి వరకు కదలని యంత్రాంగం రాత్రికి రాత్రికదులుతున్న అధికార గణం.

గత 20 రోజుల నుండి రైతులను కన్నెత్తి చూడని అధికారులు.

నిన్నటి వరకు దొరకని గోనె సంచులు, ట్రాన్స్పోర్ట్ లారీలు ట్రాక్టర్లు.

రైతు భరోసా కేంద్ర సిబ్బంది, వాలంటీర్లు దగ్గరుండి గత రాత్రి నుండే ధాన్యాన్ని తరలిస్తున్న వైనం.

*   ఆర్ 5 జోన్ వ్యవహారంలో మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించిన అమరావతి రైతులు

ఆర్ 5 జోన్లో వేరే ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాల కేటాయింపు పై హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని, రాష్ట్ర ప్రభుత్వ జీవోలను రద్దు చేయాలని సుప్రీంను ఆశ్రయించిన రైతులు

అమరావతి మాస్టర్ ప్లాన్ కు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవోలు తీసుకొచ్చిందన్న రైతులు

రైతులు దాఖలు చేసిన మద్యంతర అప్లికేషన్లను తిరస్కరించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు

కోర్టు తుది ఉత్తర్వులకు లోబడి వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం

మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు విముఖత చూపుతూ ఆదేశాలు ఇచ్చిన రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం

హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో slp దాఖలు చేసిన రైతులు

గతంలో హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వలేదని తగిన ఉత్తర్వులు ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్ ని వెనక్కి తీసుకున్న రైతులు.

హైకోర్టు ఇచ్చే ఉత్తర్వుల ఆధారంగా మరోసారి సుప్రీంకోర్టు ను ఆశ్రయించేందుకు అవకాశం కల్పించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివైస్ నేతృత్వంలోని ధర్మాసనం

సుప్రీం ధర్మాసనం కల్పించిన అవకాశం మేరకు రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన అమరావతి రైతులు

సోమవారం ఉదయం కోర్టు కార్యకలాపాలు ప్రారంభం కాగానే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసన ముందు ప్రత్యేకంగా ప్రస్తావించనున్న అమరావతి రైతుల తరపు న్యాయవాదులు

ఏలూరు జిల్లా : సీఆర్పిఎఫ్ జవాన్ అదృశ్యం,ఆగిరిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన బేటాలియన్ కమాండర్

ఆగిరిపల్లి మండలం నూగొండపల్లిలో 39వ బేటాలియన్ చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తూన్న సిఆర్పిఎఫ్ జవాన్ బుర్రి శ్రీనివాస్.

గత నాలుగు రోజుల నుండి శ్రీనివాస్ ఆచూకీ లేకపోవడంతో పోలీసులకు రిపోర్ట్ చేసిన బెటాలియన్ కమాండర్ రమాకాంత్ పాండా.

జవాన్ శ్రీనివాస్ స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా అల్లవరం గ్రామం.

* కర్ణాటకలో భారీగా నగదు స్వాధీనం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఈనెల 10న జరగనున్న విషయం తెలిసిందే.

దీంతో ఓటర్లను మభ్యపెట్టేందుకు పలువురు కోట్లాది రూపాయలను వెదజల్లుతున్నారు.

తాజాగా బెంగళూరు, మైసూరులో ఏకకాలంలో బడా ఫైనాన్షియర్ల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు వీరు ఆర్థిక సాయం చేస్తున్నారనే సమాచారంతో సోదాలు చేపట్టారు.

ఈ దాడుల్లో రూ.15 కోట్ల నగదు, రూ.5 కోట్ల విలువైన బంగారం సీజ్ చేశారు.

* ఫెవిక్విక్’ వైద్యం చేసిన ఆసుపత్రి సీజ్

తెలంగాణ : బాలుడికి ఫెవిక్విక్ వైద్యం చేసిన ఐజ రెయిన్ బో ఆసుపత్రిని అధికారులు సీజ్ చేశారు. అలాగే వైద్య సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా జోగులాంబ జిల్లా ఐజ రెయిన్బో ఆసుపత్రికి గాయంతో వెళ్లిన ఏడేళ్ల బాలుడికి కుట్లు వేయాల్సిన సిబ్బంది.. ఫెవిక్విత్తో అతికించి పంపించారు.