Business

భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు..

భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు..

ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ఆ దూకుడును సాయంత్రం వరకు కొనసాగించాయి. ఈ క్రమంలో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగంలోని షేర్లు మెరుగైన పనితీరును కనబరిచాయి.

మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 710 పాయింట్ల లాభంలో ఉండగా.. నిఫ్టీ 195 పాయింట్ల లాభాలతో ప్రయాణాన్ని ముగించాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 623 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ మిడ్ క్యూప్ సూచీ 327 పాయింట్లు గెయిన్ తో ముగిసింది.

ఈ రోజు మార్కెట్లలో కొనసాగిన బుల్ రన్ కారణంగా ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.2 లక్షల కోట్ల మేర పెరిగింది. అయితే దీనికి ప్రధానంగా 5 కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. ముందుగా పేటీఎం షేర్లు లాభపడటం కాగా రెండవది బ్యాంకింగ్ స్టాక్స్ ఉత్తమ పనితీరు. దీనికి తోడు భారత మార్కెట్లలో ఎఫ్ఐఐలు పెట్టుబడులను కొనసాగించటం బుల్ జోరుకు కారణంగా ఉంది. అలాగే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుదల, ఆసియా మార్కెట్లలో మిశ్రమ వాతావరణం కలిసొచ్చింది.

సెన్సెక్స్‌ సూచీలో ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌సీఎల్ టెక్, ఎన్‌టీపీసీ, ఎం అండ్ ఎం, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రా టెక్, మారుతీ, పవర్ గ్రిడ్, ఐసీఐసీఐ, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ టాప్ గెయినర్లుగా నిలిచాయి.

ఇదే సమయంలో సూచీలో కోల్ ఇండియా, అదానీ ఎంటర్ ప్రైజెస్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, బ్రిటానియా, ఎల్ టి, నెస్లే, దివీస్ ల్యాబ్స్ కంపెనీల షేర్లు మాత్రం నష్టపోయి టాప్ లూజర్లుగా నిలిచాయి.