Politics

బ్రదర్ అనిల్ మాటలు ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపుతాయా ..!!

బ్రదర్ అనిల్ మాటలు ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపుతాయా ..!!

గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైసీపీకి మ‌ద్ద‌తు ఇచ్చి ఓటేసిన క్రిస్టియ‌న్ క‌మ్యూనిటీ ఇప్పుడు వేరే ప్ర‌చారం వినిపిస్తోంది.వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి బావమరిది,మత ప్రచారకుడు బ్రదర్ అనిల్ కుమార్ వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తూ రాష్ట్రంలోని క్రైస్తవులను ప్రభావితం చేస్తూ 2019లో మొత్తం సంఘం వైసీపీకి మద్దతు పలికింది.మొత్తం 24 ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానాల్లో వైసీపీ 23 గెలుచుకుంది.
అయితే ఇప్పుడు ఏపీలో అనిల్ కుమార్ ప్రచారం చేయడం లేదు.ఈసారి వైసీపీకి వ్యతిరేకంగా తన సన్నిహితులు ప్రచారం చేస్తారని ఆయన భరోసా ఇస్తున్నట్లు సమాచారం.కుటుంబ సంబంధాలు,ఆస్తుల పంపకాల విషయంలో జగన్ సోదరి అయిన తన భార్యకు అన్యాయం జరిగిన నేపథ్యంలో అనిల్ కుమార్ జగన్ పై అసంతృప్తితో ఉన్నారు.అనిల్ కుమార్ జూనియర్లు తమ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని వైసీపీలో చర్చ జరుగుతోంది.
2019 ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయాలని ఓటర్లను కోరిన వారు 2024 ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటేయవద్దని సూచించడం ఆశ్చర్యకరం.ఆత్మ సూచించిన బాటలో నడవాలని వైసీపీ వాళ్లు ఓటర్లకు చెబుతున్నారు.వైసీపీకి వ్యతిరేక ప్రచారం జరుగుతుందని,పార్టీ పేరుపట్టించుకోకుండా ఓటర్కు స్పష్టత ఇచ్చేలా జాగ్రత్త
పడుతున్నారు.
గతసారి మనం బలపరచిన వ్యక్తి ధర్మమార్గంలో లేడు,అతడిని మళ్లీ సరైన దారిలోకి తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.ఈసారి మన ఆత్మను అనుసరించి మన ఓటు హక్కును వినియోగించుకుందాం అని బోధకులు అంటున్నారు.మరి ఈ మాటలు ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.