DailyDose

ఎన్నారైల ఆస్తులను జప్తు చేసిన ఈడి..

ఎన్నారైల ఆస్తులను జప్తు చేసిన ఈడి..

మంగళగిరి ఎన్నారై ఆసుపత్రి పాలకవర్గ సభ్యులు నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్, అక్కినేని మణి తదితరుల ఆస్థులు జప్తు చేసిన ఈడి

307.61 కోట్ల ఆస్తుల జప్తు

మంగళగిరి ఎం ఆర్ ఐ ఆసుపత్రికి చెందిన నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్ , అక్కినేని మణి తదితరులకు సంబందించిన ఆస్తులని , బ్యాంక్ అకౌంట్లను మనీ లాండరింగ్ కేస్ కింద ఎన్ ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఈ రోజు జప్తు చేసింది.

వీరికి సంబందించిన తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ లలో ఉన్న ఆస్తులను, భవనాలను కూడా జప్తు చేసింది.

ఈడి జప్తు చేసిన మొత్తం ఆస్తుల విలువ 307 కోట్ల 61 లక్షల రూపాయలు.

ఇదివరకే నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్, అక్కినేని మణి ఇండ్లు, ఆసుపత్రుల్లో ఈడి సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.