Politics

వైసీపీలోకి ముద్రగడ?.

వైసీపీలోకి ముద్రగడ?.

ముద్రగడ ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్దమైందని సమాచారం. కుమారుడితో సహా పార్టీలో చేరుతారని ఇందుకు ముహూర్తం కూడా ఖరారైందని తెలుస్తోంది. ముదగ్రడ లేదా ఆయన కుమారుడిని వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పిఠాపురం అభ్యర్దిగా బరిలో దించుతారని చెబుతున్నారు. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేయటం ఖాయమని సమాచారం. గతం ఎన్నికల్లో పశ్చిమ నుంచి నుంచి పోటీ చేసిన పవన్ ఈ సారి తూర్పు నుంచి పోటీకి సిద్దం అవుతున్నారు. ముద్రగడకు ప్రత్తిపాడు, పిఠాపురం నియోజకవర్గాల్లో పట్టు ఉంది. కాపు ఉద్యమ నేతగా గుర్తింపు ఉంది. చంద్రబాబు తో విభేదించిన ముద్రగడను జనసేనాని పైన అభ్యర్ధిని దింపుతారని తెలుస్తోంది. 2009లో పిఠాపురం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన ముద్రగడ ఓడిపోయారు. ప్రత్తిపాడులో గెలిచిన రికార్డు ఉన్నా, 2004లో ఓటమి తరువాత ఇక ప్రత్తిపాడు నుంచి పోటీ చేయనని ముద్రగడ ప్రకటించారు.