Business

కళ్లు చెదిరే లాభాలిచ్చిన 2 స్టాక్స్ ఇవిగో..

కళ్లు చెదిరే లాభాలిచ్చిన 2 స్టాక్స్ ఇవిగో..

నేడు స్టాక్ మార్కెట్ మొదలైన 15 నిమిషాల్లోనే టాటా మోటార్స్, టైటాన్ షేర్లు భారీగా జంప్ చేశాయి. స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే, టైటాన్ షేరు ధర 15 నిమిషాల్లోనే..

ఈరోజు రేఖ ఝున్‌ఝున్‌వాలా పోర్ట్‌ఫోలియోలోని 2 స్టాక్‌లు డబ్బుల వర్షం కురిపించాయి. ఎంత డబ్బో తెలిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. నేడు స్టాక్ మార్కెట్ మొదలైన 15 నిమిషాల్లోనే టాటా మోటార్స్, టైటాన్ షేర్లు భారీగా జంప్ చేశాయి. స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే, టైటాన్ షేరు ధర 15 నిమిషాల్లో ఒక్కో షేరుకు రూ. 2,598.70కి చేరింది. ఇందులో ఎన్‌ఎస్‌ఇలో దాని చివరి ముగింపు స్థాయి 2,548.45 నుంచి రూ. 50.25 వరకు లాభపడింది.

అదేవిధంగా, టాటా మోటార్స్ స్టాక్ సానుకూలంగా మొదలైంది. ప్రారంభంలో 5 శాతం జంప్ చేసిన తర్వాత, అది డే ట్రేడ్‌లో 10 శాతం వరకు పెరిగింది. ఇందులో మొదటి 15 నిమిషాల్లోనే ఒక్కో షేరు రూ.470.40 స్థాయి కనిపించింది. ఈ విధంగా టాటా మోటార్స్ స్టాక్ ప్రారంభ ట్రేడింగ్‌లోనే ఒక్కో షేరుకు రూ.32.75 లాభాన్ని అందించింది.

ఈ విధంగా ఈ రెండు స్టాక్‌లు మార్కెట్ ప్రారంభమైన 15 నిమిషాల్లోనే రేఖ జున్‌జున్‌వాలాకు రూ.400 కోట్ల లాభం వచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

టైటాన్ షేర్ల నుంచి రూ.230 కోట్లు..
అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో రేఖా ఝున్‌జున్‌వాలా టైటాన్ కంపెనీకి చెందిన 4,58,95,970 షేర్లను కలిగి ఉన్నారు. ఈ స్టాక్‌లో మొదటి 15 నిమిషాల్లోనే ఒక్కో షేరుపై రూ.50.25 లాభాన్ని ఆర్జించారు. రేఖా ఝున్‌జున్‌వాలా టైటాన్ కంపెనీకి 5.17 శాతం వాటాను కలిగి ఉంది. ఈ రోజు భారీ జంప్ తర్వాత మొత్తం రూ. 230 కోట్లు సంపాదించింది. అంటే 50.25 x 4,58,95,970 = రూ. 230 కోట్లు అన్నమాట.

టాటా మోటార్స్ షేర్ల ద్వారా రూ.170 కోట్లు..
FY23 మూడవ త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో టాటా మోటార్స్ లిమిటెడ్ షేర్ హోల్డింగ్ ప్రకారం, రేఖా జున్‌జున్‌వాలా కంపెనీ మొత్తం 5,22,56,000 షేర్లను కలిగి ఉంది. కంపెనీలో ఇది 1.57 శాతం వాటా కాగా, దీని ప్రకారం ఈరోజు రూ.170 కోట్ల లాభం పొందారు. ఈ ఉదయం వ్యాపారం ప్రారంభించిన 15 నిమిషాల్లోనే టాటా మోటార్స్ ఒక్కో షేరుకు రూ.32.75 లాభాన్ని అందుకుంది. దీని ప్రకారం, రేఖా జున్‌జున్‌వాలా 32.75 x 5,22,56,000 = రూ. 270 కోట్లు వచ్చాయి.