Politics

రోన్’ సెంటిమెంట్ రిపీట్.. 1957 నుంచి కొనసాగుతున్న వింత..!

రోన్’ సెంటిమెంట్ రిపీట్.. 1957 నుంచి కొనసాగుతున్న వింత..!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షించింది. అదే గడగ్ జిల్లాలోని రోన్(Ron) అసెంబ్లీ నియోజకవర్గం. దీనికి ఓ ప్రత్యేక సెంటిమెంట్ ఉండటం విశేషం.

రోన్’ సెంటిమెంట్ రిపీట్.. 1957 నుంచి కొనసాగుతున్న వింత

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షించింది. అదే గడగ్ జిల్లాలోని రోన్(Ron) అసెంబ్లీ నియోజకవర్గం. దీనికి ఓ ప్రత్యేక సెంటిమెంట్ ఉండటం విశేషం. ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే.. ఆ పార్టీయే కర్ణాటకలో అధికారంలోకి వస్తుందన్న నమ్మకముంది. 1957 నుంచి ఈ సెంటిమెంట్ కొనసాగుతోంది. అంటే ఓ రకంగా 1957 నుంచి రోన్ నియోజకవర్గంలో అధికారపక్ష ఎమ్మెల్యేలే ఉన్నారు. ఓ రకంగా ఇలాంటి వింతైన నియోజకవర్గంలో మరెక్కడా లేదన్న అభిప్రాయముంది. సెంటిమెంట్‌కు తగినట్టే ఈ ఎన్నికల్లోనూ ఆ నియోజకవర్గంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రత్యేక ఫోకస్ పెట్టాయి. విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓట్ల లెక్కింపులో రోన్ సెంటిమెంట్‌ ఈ సారి కూడా కొనసాగుతుండటం విశేషం. కాంగ్రెస్ అభ్యర్థి అక్కడ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గురుపాదగౌడ సంగనగౌడ పాటిల్ 15 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్నారు.

రోన్ నియోజకవర్గం విశేషాలు.. రోన్ నియోజకవర్గంలో మొత్తం 2,21,059 మంది ఓటర్లున్నారు. వీరిలో 1,11,475 మంది పురుష ఓటర్లు..1,09,570 మంది మహిళా ఓటర్లు. 14 మంది ట్రాన్స్‌జండర్లు. 118 శాతం మంది ఎస్సీ ఓటర్లు, 6 శాతం ఎస్టీ ఓటర్లు, 10 శాతం మంది ముస్లీం ఓటర్లు ఉన్నారు. 75 శాతం గ్రామీణ ఓటర్లు, 24 శాతం పట్టణ ఓటర్లు ఉన్నారు.