NRI-NRT

మా హోటల్ కి రండి..తనివితీరా ఏడ్చిపోండీ..

మా హోటల్ కి రండి..తనివితీరా ఏడ్చిపోండీ..

రెస్టారెంట్ కు వెళ్లడమంటే ఎగిరి గంతేస్తాం. ఇష్టమైన బిర్యానీయో.. లేకపోతే రాయలసీమ కోడి పులుసో ఫుల్ గా లాగించొచ్చని లొట్టలేస్తాం. మన దృష్టిలో హోటల్ అంటే అంతే.. ఫుల్ ఎంజాయ్ మెంట్. కానీ.. ఆ హోటల్ లో అలా కాదు. ఏడవడానికే అక్కడికి వెళ్లాలి. తట్టుకోలేనంత ఏడుపొస్తే.. ఆ హోటల్ లో రూమ్ బుక్ చేసుకోవాలి.

జపాన్ లోని టోక్యోలో మిట్సుయ్ గార్డెన్ యొట్సుయా అనే హోటల్ ఉంది. పేరే డిఫరెంట్ గా ఉంది కదూ.. పేరేంది ఈ హోటల్ కూడా డిఫరెంటే. ఇష్టమైన తిండి తినడానికి ఇక్కడకు రారు. మనసారా ఏడ్వడానికే ఈ హోటల్ డోర్ కొడతారు. అందుకే ఈ హోటల్స్ ను క్రైయింగ్ రూమ్స్ అంటారు.

కొంతమందికి ఎంత ట్రై చేసినా ఏడుపు రాదు. అలాంటి వాళ్ల కోసం సెపరేట్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. బోలెడు ఏడుపుగొట్టు సినిమాలు, వీడియోస్స్ ఉంటాయి. ఎంత ఏడుపు రానోళ్లైనా… ఆ వీడియోస్ చూశాక బోరున ఏడ్చేయాల్సిందే. ఇక… బుక్ లవర్స్ కోసం గుండెలను పిండేసే కొన్ని ట్రాజెడీ నవల్స్ ను అందుబాటులో పెట్టారు. అవన్ని చదివేసి.. తనివితీరా ఏడ్చేయొచ్చు. మనసారా ఏడ్చిన తర్వాత… తుడుచుకోవడానికి లగ్జరీ టిష్యూ పేపర్ ను కూడా అందుబాటులో ఉంటాయి. ఏడవడానికి మేకప్ అడ్డొస్తే…చెరిపేసుకోవడానికి మేకప్ రిమూవర్ కూడా దగ్గర్లోనే ఉంటుంది.

ఇంతకు ఈ ఏడుపుగొట్టు హోటల్స్ ఏంటంటే.. దీనివెనుక ఓ సైంటిఫిక్ రీజనే ఉంది. వాస్తానికి జపాన్ దేశస్తులు పని రాక్షసులు. ఒకసారి ఆఫీసులోకి ఎంట్రీ ఇస్తే చాలు…ఫ్యామిలీని అసలు గుర్తు చేసుకోరు. ఒక్కమాటలో చెప్పాలంటే వర్కోహాలిక్స్. అలా అలుపు, సొలుపు లేకుండా పని చేయడంతో…విపరీతమైన ఒత్తిడికి గురవుతారు. ఆ ఒత్తిడి నుంచి బయటపడాలంటే…..తనివి తీరా ఏడవడం ఒక్కటే సొల్యూషన్ అని డిసైడ్ అయ్యారు జపాన్ వాసులు. ఈ కాన్సెప్ట్ ఆధారంగానే టోక్యోలో ఈ హోటల్ పుట్టుకొచ్చింది.

మొత్తంగా ఇప్పుడు టోక్యో వీధుల్లో ఈ క్రైయింగ్ హోటల్ మస్త్ ఫేమస్ అయింది. హోటల్స్ కూడా.. రండి మా హోటల్ కు రండి. వచ్చి తనివితీరా ఏడ్చేయండంటూ..ఇన్వైట్ చేస్తున్నాయి. గది కావాలంటే మాత్రం ఒక రాత్రికి సింపుల్ గా ఆరు వేల రూపాయలు పే చేయాల్సిందే. అన్నట్టు చెప్పలేదు కదూ… ఇది అందిరికి కాదండోయ్.. ఆడవాళ్లకు మాత్రమే.