Health

ఆరోగ్య శ్రీ సేవలు బంద్..!

ఆరోగ్య శ్రీ సేవలు బంద్..!

రాష్ట్రంలో రేపటి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్ కానున్నాయి. మే 19 నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవోకి నోటీసు ద్వారా తెలియజేసింది. ప్రైవేటు ఆసుపత్రులకు ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించక పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో రేపటి నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు బంద్ కానున్నాయి.