Kids

పిల్లల్లో చదువులపై దృష్టి తగ్గుతోందా…

పిల్లల్లో చదువులపై దృష్టి తగ్గుతోందా…

విద్యార్థులు తమ ఆలోచనలను అదుపులో ఉంచుకుని.. మనసును ఏకాగ్రతతో ఉంచుకుంటేనే చదువులోనూ, జీవితంలోనూ విజయం సాధిస్తారు. పిల్లలకు దేనిపైనా తీవ్రమైన శ్రద్ధ ఉండదు. ఒకే దానిపై శ్రద్ధ అనేది వారు ఎక్కువగా పెట్టలేరు. అలాంటి స్థితిలో ఉన్నవారు తమ ఆలోచనలను అదుపులో ఉంచుకుని, మనసును ఏకాగ్రతతో ఉంచుకుంటేనే చదువులోనూ, జీవితంలోనూ విజయం సాధిస్తారు. విజయం సాధించాలంటే మనసును ఏకాగ్రత ఎలా చేసుకోవాలో చూద్దాం.

రాత్రిపూట ప్రశాంతమైన, గాఢమైన నిద్ర అవసరం. అప్పుడే తన ఆలోచనలను ఏకాగ్రతగా చేసుకుని చదువుపై దృష్టి సారించగలడు. వైద్యపరంగా మనిషికి రోజూ కనీసం 8 గంటల నిద్ర అవసరం. సరైన నిద్ర లేకపోతే, శరీరం మరియు మనస్సు అలసిపోతుంది. అంతే కాకుండా.. ఎన్ని పాఠాలు చెప్పినా.. బలవంతగా చదివించినా.. వారికి ఏమాత్రం గుర్తు ఉండదు. అదంతా వృధా అయిపోతుంది. కాబట్టి రాత్రిపూట ఎక్కువ సేపు టీవీలు, సినిమాలు చూడటం మానేసి సరైన సమయానికి నిద్రపోవడం, ఉదయాన్నే లేచి చదువుకోవడం మంచిది. అలా పిల్లలను అలవాటు చేయించాలి.

అల్పాహారం తప్పనిసరి. కొందరు స్కూల్ వదిలి వెళ్ళే హడావుడిలో అల్పాహారం మానేస్తారు. ఇది ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి అల్పాహారం తీసుకుంటేనే శరీరం, మెదడు చురుకుగా పని చేస్తాయి. లేకుంటే శరీరం, మెదడు అలసిపోతుంది. ఆసక్తితో చదవలేరు. చదవడం కూడా మనసుకు పట్టదు. చాలా రాత్రి తర్వాత ఖాళీ కడుపుతో ఉండకూడదు. పడుకునే ముందు ఆహారాన్ని పిల్లలకు ఇవ్వకూడదు.

ఉపాధ్యాయుడు చెప్పే పాఠం శ్రద్ధగా వినాలి. ఆ సమయంలో పక్క వారితో అస్సలు మాట్లాడకూడదు. క్లాస్ మధ్యలో ఆహారం తినకూడదనే విషయాలను పిల్లలకు తల్లిదండ్రులు చెప్పాలి. బ్లాక్ బోర్డుపై ఉపాధ్యాయుడు రాస్తున్నప్పుడు రన్నింగ్ నోట్స్ లాంటివి అలవాటు చేసుకోవాలని చెప్పాలి. చెప్పిన పాఠాలు ఇంటికి వచ్చినతర్వాత ఒకసారి రివిజన్ చేయించాలి.

వీటితో పాటు పిల్లలకు ఆటలు అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. వీటిని ఆడాలంటే.. చెప్పిన హోం వర్క్ చేయాలనే నిబంధన పెట్టాలి. హోం వర్క్ అయిన వెంటనే ఇండోర్ గేమ్స్ లాంటివి వారితో ఆడిపించాలి. సెలవు రోజుల్లో సరదాగా బయటకు తీసుకెళ్లాలి. ఇలా చేస్తే బయట ప్రపంచం గురించి తెలుస్తుంది.

ఇక చివరగా పిల్లలతో బలవంతంగా ఏ పని చేయించకూడదు. వాళ్ల అభిరుచులు ఏంటో ముందుగా తెలుసుకోవాలి. ఆ తర్వాత దానికి అనుగుణంగా తల్లిదండ్రులు అడుగు వేయాలి.