Politics

కుడి భుజం నొప్పితో బాధపడుతున్న లోకేశ్..

కుడి  భుజం నొప్పితో బాధపడుతున్న లోకేశ్..

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భుజం నొప్పితో బాధపడుతున్నారు. నంద్యాల మ్యాగ్న ఎంఆర్ఐ సెంటర్ లో లోకేష్ కుడి భుజానికి ఏంఆర్ఐ స్కానింగ్ చేస్తున్నారు. గత యాభై రోజులుగా నారా లోకేష్ కుడి భుజం నొప్పితో బాధపడుతున్నారు. అయినా ఆయన ఓర్చుకుని పాదయాత్ర చేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించిన సందర్భంలో భారీగా ప్రజలు, కార్యకర్తల వచ్చి తోపులాట జరగడంతో లోకేష్ కుడి భుజానికి గాయమైంది.

యాభై రోజలు నుంచి అప్పటి నుంచి నొప్పితో బాధపడుతూనే పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ప్రతిరోజూ ఫిజియథెరపీ చేసుకుంటూ, వైద్యుల సూచన మేరకు జాగ్రతలు తీసుకుంటున్నా నొప్పి తగ్గలేదు. యాభై రోజులు దాటిపోయినా ఇంకా నొప్పి తగ్గకపోవడం తో ఎంఆర్ఐ స్కానింగ్ చేయించాలని డాక్టర్ల సూచించారు. దీంతో నంద్యాల పద్మావతి నగర్ లో ఉన్న మ్యాగ్న ఎంఆర్ఐ సెంటర్ కి చేరుకున్న నారా లోకేష్ కుడి భుజానికి ఏంఆర్ఐ స్కాన్ చేయించుకున్నారు. ఈ ఫలితాన్ని బట్టి లోకేష్‌కు ట్రీట్‌మెంట్ చేస్తారని తెలుస్తుంది.