తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యాలయం ఏపీలోనూ ఏర్పాటు కాబోతోంది. గుంటూరులో ఈ నెల 21న కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ముహూర్తం సిద్ధం చేశారు. నిజానికి విజయవాడలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని భావించినా అక్కడ అనుకూలమైన భవనం లభించకపోవడంతో గుంటూరులో ఏర్పాటు చేస్తున్నారు.
ఆటోనగర్ వద్దనున్న ఏఎస్ కన్వెన్షన్ హాల్ వెనక భాగంలో ఐదంతస్తుల భవనాన్ని కార్యాలయం కోసం తీసుకున్నారు. ఇందులో పార్టీ సమావేశాలకు రెండు ఫ్లోర్లు, మిగిలిన వాటిలో కార్యాలయ సిబ్బంది, రాష్ట్ర నాయకులకు కేబిన్లు ఏర్పాటు చేస్తున్నారు.