Movies

శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే ప్యాలెస్ ఖర్చు రోజుకి అన్ని కోట్లా….

శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే ప్యాలెస్ ఖర్చు రోజుకి అన్ని కోట్లా….

 

తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన విలక్షణమైన నటన విభిన్నమై చిత్రాలతో ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో శర్వానంద్. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా కెరీర్ను సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకు వెళ్తోన్న అతడు.. పర్సనల్ లైఫ్ను కూడా వివాహం బంధంతో విజయవంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోన్న విషయం తెలిసిందే.

రక్షితతో అతడి పెళ్లి జూన్ 3వ తేదీన జరగబోతుంది. ఇందుకోసం రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్లో ఉన్న లీలా ప్యాలెస్ను వేదికగా నిర్ణయించుకున్నారు.

శర్వానంద్ – రక్షిత రెడ్డిల వివాహం జైపూర్లోని ప్యాలెస్లో రెండు రోజుల పాటు జరగబోతుంది. జూన్ 2వ తేదీన మెహందీ ఫంక్షన్ జరుపుతారు. ఆ తర్వాతి రోజు ఉదయాన్నే అతడిని పెళ్లి కొడుకును చేస్తారు. అనంతరం ఆరోజు రాత్రి 11 గంటలకు శర్వా తనకు కాబోయే భార్య మెడలో మూడు ముళ్లు వేస్తాడన్న మాట. ఈ పెళ్లికి అతి తక్కువ మంది మాత్రమే హాజరు కాబోతున్నారు.

ఇదిలా ఉండగా.. శర్వానంద్ పెళ్లి కోసం భారీగానే ఖర్చు చేస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది. అతడి పెళ్లి జరగనున్న ప్యాలెస్కు ఒక్క రోజుకు రూ. 4 కోట్లు చెల్లించాల్సి ఉంటుందట. అలాగే ప్రయాణ ఖర్చులతో పాటు మెహందీ సంగీత్లకు కలిపి దాదాపు రూ. 10 కోట్లు ఖర్చు చేస్తున్నాడని తెలిసింది. దీంతో ఇప్పుడు శర్వా పెళ్లి నేషనల్ వైడ్గా హాట్ టాపిక్గా మారిపోయింది.