DailyDose

TNI తాజా వార్తలు….

TNI తాజా వార్తలు….

వేసవి సెలవుల కారణంగా తిరుమల కొండపై రద్దీ…

వేసవి సెలవుల కారణంగా భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో భక్తుల సౌకర్యార్థం స్వామి వారి ఆర్జిత సేవలు, వీఐపీ దర్శనాల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. శుక్రవారం నుంచి ఆదివారం వరకు జరిగే సుప్రభాత సేవకు విచక్షణ కోటా రద్దైంది. ఫలితంగా 20 నిమిషాలు కలిస్తొంది. గురువారం తిరుప్పావడ సేవను ఏకాంతంగా నిర్వహిస్తారు. దీని వల్ల అరగంట ఆదా అవుతుంది.

సర్వదర్శనం భక్తులకు దర్శనానికి 30 నుంచి 40 గంటల సమయం పడుతుండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. కాబట్టి భక్తులు, వీఐపీలు సహకరించాలని కోరారు.

*  హైదరాబాద్‌లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు...

టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని కైత్లాపూర్‌ గ్రౌండ్‌లో శనివారం ఈ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో నందమూరి కుటుంబసభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు, హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ట్రాఫిక్ అండ్ లా అండ్ ఆర్డర్ అధికారులు భారీ ఏర్పాట్లు చేసి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు.

ఈ సందర్భంగా ప్రసంగించిన వక్తలందరూ ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. వేడుకలకు హాజరైన వారితో ఖైతలాపూర్ జనసంద్రాన్ని తలపించింది. అంగరంగ వైభవంగా జరిగిన వేడుకల ఫొటో మాలిక మీ కోసం.

ఎన్టీఆర్ కలను సజీవంగా ఉంచేందుకు పనిచేద్దాం రాంచరణ్…

తెలుగు సినిమాకు గర్వకారణమైన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరు కావడం గౌరవంగా భావిస్తున్నానని రాంచరణ్ తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘నేను ఎన్టీఆర్ నుంచి నేర్చుకున్న పాఠాలలో ముఖ్యమైనది.. ఐకమత్యమే మహా బలం. ఆయన కలను సజీవంగా ఉంచేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం’ అని పేర్కొంటూ చంద్రబాబు, బాలకృష్ణలను ట్యాగ్ చేశారు.

నేడు ఏపీలో బీఆర్ఎస్ కొత్త కార్యాలయం ప్రారంభం…

బీఆర్ఎస్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ విస్తరించేందుకు కీలక అడుగు వేసింది బీఆర్‌ఎస్‌ పార్టీ. నేడు గుంటూరులో బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. మంగళగిరి రోడ్డులోని AS కన్వెన్షన్ సెంటర్ వద్ద నేడు ఉదయం 11 గంటలకు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు బిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ తెలిపారు.

పవన్‌ డెడ్‌లైన్‌..

అధికారుల నిబద్ధత చూడటానికి మరో నెల రోజులు ఆగుదాం’ అన్నమయ్య డ్యామ్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. ప్రభుత్వ చర్యలు మోకాలడ్డే విధంగా ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. వరద బాధితులకు నెలలో ఇళ్ల నిర్మాణం చేపడతామని తాజాగా అధికారులు ప్రకటించడంపై పవన్ స్పందించారు. అధికారులు తమ హామీని నెరవేర్చడంలో ఎంత నిబద్ధతతో ఉంటారో చూడడానికి మరో నెల రోజులు ఆగాలి అని పవన్ ట్వీట్ చేశారు.

అమెరికాలో ఎల్ సాల్వడార్ స్టేడియంలో తొక్కిసలాట 9 మంది మృతి …

ఎల్ సాల్వడార్ స్టేడియంలో ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో కనీసం 9 మంది మరణించారు

ఎల్ సాల్వడార్ స్టేడియంలో తొక్కిసలాట న్యూస్: ఎల్ సాల్వడార్ స్టేడియంలో జరిగిన తొక్కిసలాటకు ప్రజలు బయటి నుంచి మ్యాచ్ చూసేందుకు స్టేడియంలోకి రావడంతో తొక్కిసలాట జరిగిందని సమాచారం. తొక్కిసలాటలో 09 మంది మృతి చెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ

పశ్చిమ బీహార్ నుండి ఉత్తర తెలంగాణ వరకు చత్తీస్‌గఢ్ మీదుగా కొనసాగుతున్న ద్రోణి

దీని ప్రభావంతో మూడు రోజులు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు

నేడు అనకాపల్లి,అల్లూరి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు

ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు

సత్యసాయి,అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు

ఈదురు గాలులు, పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద ఉండరాదు..

ప్రధాని మోదీని ఆటోగ్రాఫ్​ అడిగిన బైడెన్…

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రస్తుతం జీ 7 సమ్మిట్ లో భాగంగా జపాన్ లోని హిరోషిమాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన వివిధ దేశాల అధినేతలతో మోదీ వ్యక్తిగతంగా భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర సంఘటన వెలుగులోకి వచ్చంది. స్వయంగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ప్రధాని మోదీని ఆటోగ్రాఫ్ అడినట్టు తెలుస్తోంది.

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకు రాహుల్ నివాళులు …

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 32వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం ఘనంగా నివాళులు అర్పించారు. “పాపా, మీరు నాతో, స్ఫూర్తిగా, జ్ఞాపకాలలో, ఎల్లప్పుడూ!” అని రాజీవ్ గాంధీకి సంబంధించిన వివిధ క్షణాల వీడియోను షేర్ చేస్తూ రాహుల్ గాంధీ హిందీలో ట్వీట్ చేశారు.అంతకుముందు, రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి దేశ రాజధానిలోని వీర్ భూమిలో మాజీ ప్రధాని 32వ వర్ధంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులర్పించారు.

రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాల్సింది మోడీ కాదు…

 పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాల్సింది మోడీ కాదు రాష్ట్రపతి రాహుల్ గాంధీ

మే 28న ప్రధాని మోడీ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడాన్ని విపక్ష నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వీర్ సావర్కర్ జయంతి రోజున కొత్త పార్లమెంటును ప్రారంభించడమేంటని కాంగ్రెస్ సీనియర్ నేత జై రాంరమేశ్ ఇటీవలే ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ ప్రభుత్వాధినేత.. శాసనసభకు అధిపతి కాదని.. మోడీ పార్లమెంటును ఎందుకు ప్రారంభించాలని ఎంఐఎం అధినేత ఓవైసీ కూడా ప్రశ్నించారు. లేటెస్ట్ గా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాల్సింది ప్రధాని మోడీ కాదు.. రాష్ట్రపతి అంటూ ట్వీట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో తాగునీటి సంక్షోభం రావొచ్చు NCBN….

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ తాగునీటి సంక్షోభం దిశగా పయనిస్తోందని తెలిపారు. జల్ జీవన్ పథకం అమలులో ఏపీ 18వ స్థానంలో ఉందని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలకు ఇదొక ప్రబల నిదర్శనం అని చంద్రబాబు పేర్కొన్నారు.