Uncategorized

ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు….

ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు….

ఈ నెల 24 నుండి జూన్ 1 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులసహాయార్థం ఇంటర్ బోర్డు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. పరీక్షలకు సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తినా విద్యార్థులు, తల్లిదండ్రులు 7075136947 నెంబరుకు ఫోన్ చేసి తెలపాలని RIO పీ.రవికుమార్ ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసారు.

ఈ నెల 24 నుండి జూన్‌ 1 వరకు ఉదయం 9 గంటల నుండి 12 వరకు మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుండి 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ప్రాక్టికల్‌ పరీక్షలు జూన్‌ 5 నుండి 9 వరకు ఉదయం 9 గంటల నుండి 12 వరకు మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2 నుండి 5 వరకు జరుగుతాయని తెలిపారు