WorldWonders

పూజ ముగిసిన తర్వాతే హారతి ఎందుకు ఇస్తారో తెలుసా…

పూజ ముగిసిన తర్వాతే హారతి ఎందుకు ఇస్తారో తెలుసా…

మన దేశంలో సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయం.. ప్రతిది ఒక పద్ధతి ప్రకారం చేశారు.. పూజ నుంచి మొదలుకొని తినే భోజనం వరకు అన్నీ కొన్ని నియమాలతో ముగిస్తారు.పూజ చేసిన తర్వాత హారతి ఇస్తేనే పూజ సంపూర్ణం అవుతుంది.. ఎప్పుడైనా హారతి ఇచ్చేటప్పుడు గమనిస్తే గంటను మోగిస్తూ ఉంటారు. ఆ సమయంలో భక్తులు రెండు చేతులతో హారతిని కళ్లకు అద్దుకుని సవినయంగా నమస్కరిస్తారు. కొన్ని ప్రదేశాల్లో శంఖాన్ని ఊదుతారు. గంటలు, శంఖం శబ్దం వల్ల మనస్సులో ఎలాంటి ఆలోచనలు లేకుండా పూర్తిగా భగవంతుడిపై మనస్సును లగ్నం చేస్తుంది. ఫలితంగా శరీరంలో నిద్రిస్తున్న ఆత్మ మేల్కొంటుంది. శరీరంలో కొత్త ఉత్సహం కలుగుతుంది.

ఒకప్పుడు ఆలయాలలో ఎలాంటి కృత్రిమమైన దీపాలూ ఉండేవి కావు. పైగా గాలి తగలకుండా రాతితో ఆ నిర్మాణాలు సాగేవి. అలాంటి ప్రదేశాలలో తేమ అధికంగా ఉండటం సహజం. దీంతో దుర్వాసన, సూక్ష్మక్రిములు దరిచేరక తప్పదు. కర్పూరానికి సూక్ష్మక్రిములను సంహరించే శక్తి, అంటువ్యాధులను నివారించే గుణం ఉన్నాయని ప్రాచీన వైద్యుల నమ్మకం. ఇప్పుడంటే కర్పూరపు తయారీలో రసాయనాలను ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు కర్పూరం చెట్ల నుంచే సేకరించేవారు. ఆ రకంగా ఫలపుష్పార్చనకూ, ధూపదీపాలకూ పూర్తిగా వృక్షాల మీదే ఆధారపడేవారు. పూజ అంతా ప్రకృతి సిద్ధంగానే సాగేది..

కర్పూరానికి రెండు సుగుణాలు ఉన్నాయి. ఒకటి ఎలాంటి అవశేషమూ మిగలకుండా దహించుకుపోవడం. రెండోది సుగంధాన్ని, ప్రకాశాన్ని వెదజల్లడం. బహుశా మనిషి జీవితం కూడా ఇలాగే సాగాలన్నది దీనివెనుకున్న ఆంతర్యం. భక్తుడు ఎలాంటి కర్మ ఫలమూ మిగలకుండా, మోక్షం వైపుగా సాగిపోవాలనీ.. జీవించినంతకాలం జ్ఞానమనే ప్రకాశాన్నీ, సద్గుణాలు అనే సుగంధాలనీ వెదజల్లుతూ ఉండాలనీ పెద్దల అభిమతం కావచ్చు..కర్పూరం వెలిగిస్తే చాలా మంచిది.. ఆ వాసనాలకు మనసు ప్రశాంతంగా ఉంటుంది.. ఆ పరిమళాలకు మెచ్చిన దేవుడి అనుగ్రహం కూడా లభిస్తుందని పండితులు చెబుతున్నారు..