భారతదేశంలో పర్యటించాలని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం ఆహ్వానించారు. ఈ ఏడాది భారతదేశంలో జరగనున్న క్రికెట్ వరల్డ్ కప్, దీపావళి వేడుకలను వీక్షించాలని ప్రధాని మోదీ ఆస్ట్రేలియా ప్రధానిని కోరారు.సిడ్నీలో ఆస్ట్రేలియా ప్రధానితో(Australian PM Anthony Albanese) ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో భారత విదేశాంగ మంత్రి (ఈఏఎం) ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ కూడా హాజరయ్యారు.
బుధవారం ఆస్ట్రేలియాలోని సిడ్నీలోని అడ్మిరల్టీ హౌస్‌లో ప్రధాని మోదీకి సెరిమోనియల్ గార్డ్ ఆఫ్ హానర్ లభించింది.సిడ్నీలోని అడ్మిరల్టీ హౌస్‌లో సందర్శకుల పుస్తకంపై ప్రధాని మోదీ సంతకం చేశారు.మంగళవారం సిడ్నీలో ఆస్ట్రేలియాకు చెందిన అగ్రశ్రేణి కంపెనీల వ్యాపార నేతలతో ప్రధాని మోదీ సమావేశాలు నిర్వహించారు, ఈ సమావేశాల సందర్భంగా సాంకేతికత, నైపుణ్యం, స్వచ్ఛమైన ఇంధనం వంటి రంగాల్లో భారతీయ పరిశ్రమలతో సహకారాన్ని పెంపొందించుకోవాలని మోదీ పిలుపునిచ్చారు.