Sports

ఫైనల్ బెర్త్ కోసం గుజరాత్-ముంబై ఫైట్..

ఫైనల్ బెర్త్ కోసం గుజరాత్-ముంబై ఫైట్..

ఐపీఎల్ 2023 క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్.. క్వాలిఫయర్ 2కు అర్హత సాధించింది. ఇక క్వాలిఫయర్ 2లో గుజరాత్ టైటాన్స్‌తో ముంబై తలపడనుంది. అహ్మదాబా‌ద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో శుక్రవారం (మే 26) రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఐపీఎల్ 2023 ఫైనల్ బెర్త్ కోసం గుజరాత్, ముంబై జట్లు పోరాడనున్నాయి.

తుది జట్లు (అంచనా):
గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా, శుభమాన్ గిల్, దసున్ షనక, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ, మోహిత్ శర్మ, దర్శన్ నల్కండే.
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, నేహాల్ వధేరా, కామెరాన్ గ్రీన్, టిమ్ డేవిడ్, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, హృతిక్ షోకీన్, ఆకాష్ మధ్వల్.