NRI-NRT

చైనాలో మరో కొత్త వైరస్….

చైనాలో మరో కొత్త వైరస్….

ప్రపంచాన్ని అల్లాడించిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ మళ్లీ ప్రబలుతోందా? అంటే అవునంటున్నారు చైనా దేశానికి చెందిన సీనియర్ ఆరోగ్య సలహాదారు. కరోనా ముప్పు తొలగిపోయిందని అనుకుంటున్న నేపథ్యంలో చైనా దేశంలో జూన్ నెల చివరి నాటికి వారంలో 65 మిలియన్ల కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఎక్స్‌‌బీబీ ప్రబలవచ్చని చైనా వైద్య నిపుణలు వెల్లడించారు.(XBB Covid variant) చైనా దేశంలో కరోనా కొత్త ఎక్స్‌‌బీబీ వేరియంట్ ఏప్రిల్ నెల నుంచి వ్యాపిస్తోంది.కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి గురించి గ్వాంగ్‌జౌ నగరంలో బయోటెక్‌లో శ్వాసకోశ వ్యాధి నిపుణుడు జాంగ్ నాన్‌షాన్ వెల్లడించారు.

కొవిడ్ 19 ఇకపై గ్లోబల్ ఎమర్జెన్సీగా అర్హత పొందదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన కొద్దిరోజుల తర్వాత చైనా కొత్త వేరియంట్ ముప్పు ఉందని తెలిపింది.కరోనా వైరస్ అత్యవసర దశ ముగిసినప్పటికీ, ఈ మహమ్మారి అంతం కాలేదని ఆగ్నేయాసియా,మధ్యప్రాచ్యంలో ఇటీవల కరోనా కేసులు పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది