Politics

జూన్ 7న ఏపీ కేబినెట్ భేటీ….

జూన్ 7న ఏపీ కేబినెట్ భేటీ….

ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం జూన్ 7వ తేదీన నిర్వహించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం జగన్ నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గం జూన్ 7వ తేదీ ఉదయం 11 గంటలకు సచివాలయంలోని బ్లాక్ 1‌లో ఈ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు, పథకాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఉద్యోగుల ఆందోళనలపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది