రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో భేటీ అనంతరం బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ని వెంటనే మాస్కో లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పుతిన్‌తో నాలుగు గంటలపాటు భేటీ తర్వాత ఈ ఘటన చోటు చేసుకోవడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది.
భేటీ తర్వాత కొన్ని గంటల్లోనే లుకషెంకో ఆరోగ్యం క్షీణించడంపై రష్యా అధ్యక్ష కార్యాలయం పాత్ర ఉండొచ్చని బెలారస్ ప్రతిపక్ష నేత వాలెరీ టెప్‌కలో అనుమానం వ్యక్తం చేశారు. లుకషెంకోపై విషప్రయోగం జరిగి ఉంటుందని ఆరోపించారు.
కాగా, బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అత్యంత సన్నిహితుడు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో వీరు చాలా సేపు ఫోన్లో సంభాషించారు. అనంతరం పుతిన్‌కు పుట్టిన రోజు సందర్భంగా లుకషెంకో ప్రత్యేక బహుమతి కూడా అందించారు.