NRI-NRT

కొలంబస్‌లో NTR చిత్రాల ప్రదర్శనకు అపూర్వ స్పందన

కొలంబస్‌లో NTR చిత్రాల ప్రదర్శనకు అపూర్వ స్పందన

నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కొలంబస్-ఒహియోలో అడవిరాముడు, దాన వీర శూర కర్ణ చిత్రాలను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనల ద్వారా సమకూరిన నిధులు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి విరాళంగా అందజేశారు. సుషు ఉప్పుటూరి, రాజా బొమ్మన, సుశీల బొమ్మన, సురేష్ పూదోట, రంగ గుంటపల్లి, నళిని, రవి సామినేని, శివ చావా, వేణు చావా, శ్రీకాంత్ మునగాల, టాకో ప్రెసిడెంట్ రాజీవ్ రెడ్డి, టాకో అక్షరమాల టీం, రేవూరి ఫామిలీ, ఆప్కో ట్రస్టీ రవి శాస్త్రి తదితరులు కార్యక్రమ విజయవంతానికి కృషి చేశారు.