NRI-NRT

రాహుల్ కు వ్యతిరేకంగా ఖలిస్థాన్ మద్దతుదారుల నినాదాలు…

రాహుల్ కు వ్యతిరేకంగా ఖలిస్థాన్ మద్దతుదారుల నినాదాలు…

యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో జరిగిన ఓ సభలో భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రేక్షకులు నినాదాలు చేశారు. బుధవారం కాలిఫోర్నియాలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ఖలిస్తానీ నినాదాలతో హోరెత్తించారు

కాంగ్రెస్ హయాంలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లను ప్రస్తావిస్తూ వారు నినాదాలు చేయడంతో సభలో ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. ఖలిస్థానీ మద్దతుదారుల నినాదాలపై రాహుల్ గాంధీ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరినీ అభిమానిస్తుందని తెలిపారు. తాము ఎవరి పట్ల ఆగ్రహావేశాలను, ద్వేషాన్ని ప్రదర్శించబోమని స్పష్టం చేశారు.

కాగా, రాహుల్ సభలో ఖలిస్థాన్ నినాదాల వీడియో క్లిప్పింగ్ ను బీజేపీ నేత అమిత్ మాల్వియా ట్విట్టర్ లో పంచుకున్నారు. ఇది 1984 నాటి మారణహోమానికి స్పందన అని వెల్లడించారు. మీరు రాజేసిన విద్వేషాగ్ని ఇప్పటికీ మండుతూనే ఉందని మాల్వియా వ్యాఖ్యానించా