NRI-NRT

NTRకు భారతరత్న ఇవ్వాలి

NTRకు భారతరత్న ఇవ్వాలి

ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని డాక్టర్ శ్రీనివాస్ మంచికలపూడి అన్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు అమెరికాలోని లూయిస్ విల్లే మహానగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ శ్రీనివాస్ మంచికలపూడి అధ్యక్షత వహించారు.

రావు కన్నెగంటి, మహేంద్ర సుంకర, నరేష్ బొప్పన, వేణు సబ్బినేని తదితరులు ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచారు. ఈ కార్యక్రమానికి మహిళలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి.