కారులో ఔటర్ రింగురోడ్డుపై వెళ్తున్నారా.. ఫాస్ట్‌టాగ్‌తో టోల్‌ఛార్జీలు చెల్లిస్తున్నారా… అయితే అప్రమత్తంగా ఉండాల్సిందే. లేదంటే జేబుకు చిల్లే. ఫాస్ట్‌టాగ్ వినియోగంలో కొంతమంది అవగాహన లోపంతో ప్రయాణించిన దూరం కంటే ఎక్కువ ఛార్జీలు చెల్లిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఒకే ఎంట్రీ నుంచి ఒకే ఎగ్జిట్‌కు రూ.20లు చెల్లిస్తే సరిపోతుంది. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా.. తెలియకపోయినా.. సాంకేతిక కారణాలతో ఫాస్ట్‌ట్యాగ్ రీడ్ కాకపోతే ఎగ్జిట్ వద్ద రూ.90 నుంచి ఆపైనే చెల్లించాలి.
సాంకేతిక లోపాలతో వారిపై అదనపు ఛార్జీల భారం పడుతోంది. ఉదాహరణకు కారుకు కనీస ఛార్జీ రూ.10 కాగా.. గరిష్ఠం రూ.170 వరకు ఉంటుంది. అదే ఎంట్రీ వద్ద ఫాస్ట్‌ట్యాగ్ రీడ్ కాకపోతే ఈ ఛార్జీల భారం మూడు రెట్లు పెరుగుతుంది.
ఫాస్ట్‌టాగ్‌లో బ్యాలెన్స్ ఉందో లేదో చూసుకోవాలి. ఎంట్రీ దాటిన తర్వాత రీఛార్జి చేస్తుంటారు. దీంతో ఎక్కడ ఔటర్ పైకి ఎక్కారో నమోదు కాదు. టోల్ నిబంధనల ప్రకారం ఈ ఛార్జీలను మూడో ఎగ్జిట్ నుంచి లెక్కలోకి తీసుకొని వసూలు చేస్తారు.ఎంట్రీ వద్ద కొన్నిసార్లు ఫాస్ట్‌టాగ్ రీడ్ కాదు. ఔటర్‌పైకి ఎక్కే ముందే ఫాస్ట్‌ట్యాగ్ రీడ్ అయిందో లేదో సరిచూసుకోవాలి. రీడ్ కాకపోతే వెంటనే ఆ విషయాన్ని బూత్ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లాలి.ఇతరుల వాహనాలు తీసుకొని వెళ్లడం వల్ల వారి ఫోన్ నెంబర్లే ఫాస్ట్‌టాగ్‌కు అనుసంధానమై ఉంటాయి. పొరపాటున ఫాస్ట్‌టాగ్ రీడ్ కాకపోయినా గుర్తించలేరు.
దాదాపు 18 బ్యాంకుల వరకు ఫాస్ట్‌ట్యాగ్ సేవలు అందిస్తున్నాయి. 2-3 ఏళ్ల తర్వాత వీటిని మార్చుకుంటూ ఉండాలి. లేదంటే రీడింగ్‌లో జాప్యం జరుగుతుంది. రీడింగ్ కోసం 2-3 సెకన్ల కంటే ఎక్కువ టైం పడితే వెంటనే బ్యాంకుల వద్దకు వెళ్లి మార్చుకోవాలి.కొన్నిసార్లు ఔటర్‌పై రద్దీ పెరిగినప్పుడు టోల్ నిర్వాహకులు ఫాస్ట్‌ట్యాగ్ లేని గేట్ల నుంచి వాహనాలను పంపిస్తుంటారు. ఇలాంటప్పుడు మాన్యువల్ రసీదు తీసుకోవాలి.ఔటర్‌పై 24 గంటల్లో రెండుసార్లు ప్రయాణించినప్పుడు రెండోసారి 50 శాతం టోల్‌ఛార్జీలు చెల్లిస్తే సరిపోతుంది. మొదటి ప్రయాణ సమయంలో ఎంట్రీ వద్ద నమోదు కాకపోతే 24 గంటల్లో రెండోసారి ప్రయాణించినా సరే…ఎలాంటి రాయితీ వర్తించదని గుర్తించాలి.