NRI-NRT

స్పెల్లింగ్ బీ’లో గెలిచి 50 వేల డాలర్లు గెలిచిన భారత సంతతి టీనేజర్….

స్పెల్లింగ్ బీ’లో గెలిచి 50 వేల డాలర్లు గెలిచిన భారత సంతతి టీనేజర్….

1924లో అమెరికాలో ‘నేషనల్ స్పెల్లింగ్ బీ’ ప్రారంభమైంది. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా ఈ పోటీల్లో భారత సంతతి విద్యార్థులే ముందు వరుసలో నిలుస్తున్నారు. ఎనిమిదవ తరగతి లోపు విద్యార్థులు అందరూ ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. పోటీల్లో అడిగే కఠినమైన ఆంగ్ల పదాల అక్షర క్రమాన్ని సరిగ్గా చెప్పే వారు విజేతలు అవుతారు.

అమెరికాలో జరిగిన నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీలో విజేతగా ఓ భారత సంతతి టీనేజర్ 14 ఏళ్ల దేవ్ షా విజేతగా నిలిచాడు. PSAMMOPHILE (శామాఫైల్) అనే పదానికి స్పెల్లింగ్ చెప్పిన దేవ్.. 50వేల డాలర్ల ఫైజ్ మనీ గెలుచుకున్నాడు.ప్రపంచవ్యాప్తంగా జరిగే ఈ పోటీలో ఈమారు మొత్తం 11 లక్షల మంది పాల్గొన్నారు. తుది దశకు చేరుకున్న 11 మందిలో దేవ్ షా కూడా ఒకరు. శామాఫైల్ అంటే ఇసుక నేలల్లో కనిపించే జీవి లేదా మొక్క. ఈ విజయాన్ని నమ్మలేకపోతున్నానని దేవ్ చెప్పాడు. ఈ పోటీ కోసం తన కుమారుడు నాలుగేళ్లుగా ప్రిపేర్ అయినట్లు దేవ్ తల్లి తెలిపారు.