Politics

అసెంబ్లీ ఎన్నికలకు ఇసి సన్నాహాలు….

అసెంబ్లీ ఎన్నికలకు ఇసి సన్నాహాలు….

త్వరలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగనుంది. దీంతో అన్ని పార్టీల నాయకులు అలర్ట్ అయిపోయారు. ఎవరికివారు వారి వారి స్టాటాజీలతో ప్రజల్లోకి వెళ్లేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ వేడెక్కుతున్నాయి.గతంలో జరిగిన శాసనసభ ఎన్నికల తేదీలనే పరిగణలోకి తీసుకొని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో తెలంగాణలో సన్నాహాలు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అన్నారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై అన్ని రకాల అంశాలను నిర్దిష్టంగా పరిశీలించి త్వరలోనే ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటుందని తెలియజేశారు. అంతేకాకుండా జిహెచ్ఎంసి పరిధిలో ఓటర్ నమోదు, ఇతర కార్యక్రమాలపై బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించబోతున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్(vikas raj) మీడియా ముఖంగా తెలియజేశారు. ఈ పరిస్థితి చూస్తుంటే ఇక కొన్ని నెలల్లోనే ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తోంది.