NRI-NRT

ఎలోన్ మస్క్ బేబీ చిత్రం ట్విట్టర్ లో వైరల్….

ఎలోన్ మస్క్ బేబీ  చిత్రం ట్విట్టర్ లో  వైరల్….

అపర కుబేరుడు ఎలాన్ మస్క్ గురించి తెలియని వారు ఉండరు. ప్రపంచంలోనే ధనవంతుడిగా కొనసాగుతున్నారు. అయితే, ప్రస్తుతం ఆయన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చిన్ననాటి మస్క్ ఎలా ఉండేవారో సూచిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గీచిన ఆ చిత్రాన్ని చూసి బుల్లి ఎలాన్ మస్క్ ఎంత అందగా ఉన్నాడో అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. దీనికి మస్క్ సైతం ఫిదా అయ్యారు.

బేబీ మస్క్ పేరుతో ఈ ఫొటోను ట్వీట్ చేస్తూ అమెరికాకు చెందిన ఓ యూజర్ ఫన్నీగా కామెంట్ పెట్టాడు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వయస్సు పెరగకుండా ఉంచే ఫార్ములాను కనుగొన్నాడని, దానిని తొలుత తనే వినియోగించాడని చెప్పాడు. అయితే, ఆ ఫార్ములా కాస్తా వికటించి ఎలాన్ మస్క్ ఇలా మారిపోయాడంటూ జోక్ చేశాడు. ఈ ట్వీట్ కు 48 గంటల్లో 40 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.