Politics

పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన జగన్….

పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన జగన్….

పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ. 12,911 కోట్లు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పోలవరం ప్రాజెక్టును ఏపీ ముఖ్యమంత్రి జగన్ సందర్శించారు. హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేశారు. కాఫర్ డ్యామ్ పనులు, ఇప్పటి వరకు పూర్తైన పనుల వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలించిన అనంతరం ప్రాజెక్ట్ కాన్ఫరెన్స్ హాల్ లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనులకు సంబంధించి అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. పోలవరం పనుల పురోగతిపై అధికారులు ఫోటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. ఎగువ కాఫర్‌ డ్యాం వద్ద ఫోటో ఎగ్జిబిషన్‌ను సీఎం జగన్‌ తిలకించారు. వరదల సమయంలో ఎగువ కాఫర్‌ డ్యాం పెంచిన ఎత్తు తీరును, పూర్తైన పనుల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు.