NRI-NRT

తానా మహాసభలకు ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు…

తానా మహాసభలకు ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు…

 

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జూలై 7,8,9 తేదీల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఈ మహాసభల్లో పాల్గొనేందుకు ఎంతోమంది ప్రముఖులను తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, మహాసభల కన్వీనర్‌ రవి పొట్లూరి ఆహ్వానిస్తున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడును కూడా వారు మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. తానాతో ఎంతో అనుబంధం ఉన్న వెంకయ్య నాయుడు పలు తానా కార్యక్రమాల్లో, మహాసభల్లో పాల్గొని ప్రసంగించి ఆకట్టుకున్నారు. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన తానా కళారాధన కార్యక్రమంలో కూడా వెంకయ్య నాయుడు పాల్గొని తానా సేవలను, తెలుగు భాషకు తానా చేస్తున్న సేవను ప్రశంసించిన సంగతి తెలిసిందే. వెంకయ్య నాయుడు రాక తానా మహాసభలకు మరో ఆకర్షణగా ఉంటుందని చెప్పవచ్చు.