Politics

ఏ సిఎం ఎక్కువ జీతం తీసుకుంటారంటే….

ఏ సిఎం ఎక్కువ జీతం తీసుకుంటారంటే….

దేశానికి ప్రధానమంత్రి ఎలాగో రాష్ట్రానికి బాస్ ముఖ్యమంత్రి. మనందరం నచ్చి మెచ్చి ఎన్నుకునే వ్యక్తులనే ముఖ్యమంత్రిగా చేస్తుంటారు.ఈ జాబుకు వారు కూడా ప్రభుత్వ ఉద్యోగుల లాగే జీతాలు తీసుకోవాలి. అలా దేశంలో ఫేమస్ అయిన కొంతమంది ముఖ్యమంత్రులు జీతభత్యాలు ఇప్పుడు తెలుసుకుందాం..

  • కేసీఆర్ – మనదేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే ఎక్కువగా జీతం తీసుకుంటున్న ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఈయన జీతం నాలుగు లక్షల పదివేల రూపాయలు. దీంతో పాటు హౌస్ రెంటు అలవెన్స్, టెలిఫోన్ బిల్లులు, వెహికల్ అలవెన్స్ , ఇతర సౌకర్యాలు అన్ని కల్పిస్తారు.ఇక
  • ఎక్కువ జీతం తీసుకుంటున్న ముఖ్యమంత్రి లో రెండవ స్థానంలో ఉన్నది ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఈయనకు నెలకు అక్కడి సర్కార్ నాలుగు లక్షల రూపాయలు ఇస్తోంది.
  • దేశంలో ఎక్కువ జీతం తీసుకునే ముఖ్యమంత్రుల్లో మూడవ స్థానంలో ఉన్నది  యోగి ఆదిత్యనాథ్ మూడు లక్షల అరవై ఐదు వేల జీతం తీసుకుంటాడు.
  • ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిండేకు నెలకు 3,40,000 జీతం ఇస్తారట.
  • ఇక తమిళనాడు సీఎం  స్టాలిన్. రెండు లక్షల 5 వేల రూపాయలు తీసుకుంటున్నారు.
  • ఇక ఇందులో  సీఎం జగన్ మాత్రం చాలా డిఫరెంట్. తనకచ్చే  2,50,000 జీతాన్ని ఆయన ప్రభుత్వ ఖజానాకే ఖర్చు పెడతారట.