Politics

రేపు మాజీ ఎంపీ పొంగులేటి కీలక సమావేశం…..

రేపు మాజీ ఎంపీ పొంగులేటి కీలక సమావేశం…..

ఖమ్మం రాజకీయాలు ఆసక్తిగా మారాయి. రేపు మాజీ ఎంపీ పొంగులేటి కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటలకు ఎస్సార్‌ కన్వెన్షన్‌ హాల్‌లో తన అనచరులు, ఆత్మీయులతో భేటీ కానున్నారు. ఇప్పటికే ఈ సమావేశానికి సంబంధించి.. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అభిమానులు, కార్యకర్తలకు ఫోన్లు కూడా వెళ్లాయి. అయితే. ఈ భేటీలో కాంగ్రెస్‌ పార్టీలో చేరికపై అనుచరులతో చర్చించి.. పొంగులేటి తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే ఛాన్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. పార్టీలో చేరికతో పాటు భారీ బహిరంగ సభకు సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం.