Politics

కాంగ్రెస్ తప్పుడు ప్రచారం పై కవిత దశాబ్ది ఉత్సవాల్లో వ్యాక్యాలు…

కాంగ్రెస్ తప్పుడు ప్రచారం పై కవిత దశాబ్ది ఉత్సవాల్లో వ్యాక్యాలు…

తెలంగాణ పథకాలను అన్ని రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సాగనీటి దినోత్సవాల్లో ఆమె మాట్లాడుతూ.. దశాబ్ది ఉత్సవాలపై కాంగ్రేస్ పార్టీ తప్పుడు ప్రచారం చేయడం ఏమాత్రం సరైంది కాదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేకే.. కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. చెరువుల పండగతో గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొందని, తెలంగాణ సంస్కృతిని చాటి చెప్తున్నాయని అన్నారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సొంతూరులో పింఛన్ ఇవ్వడానికి ఆలోచించేవారని దుయ్యబట్టారు. వడ్డించేవాళ్ళు మన వాళ్ళు ఉండటం వల్లే.. సంక్షేమ పథకాలు అమలు, ప్రతి ఇంటికి చేరుతున్నాయన్నారు. కాంగ్రెస్ నాయకులు కేవలం లొల్లి పెట్టడానికే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.