Politics

సిసోడియాను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టిన కేజ్రీవాల్‌….

సిసోడియాను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు  పెట్టిన కేజ్రీవాల్‌….

ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌..మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియాను గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టారు. నగరంలో ఓ స్కూల్‌ ప్రారంభోత్సవానికి హాజరైన సీఎం కేజ్రీవాల్‌ సిసోడియాను తలుచుకుని భావోద్వేగానికి లోనయ్యారు. మనీశ్‌ సిసోడియా గారు ఇది మొదలుపెట్టారు. ఇవాళ ఆయన్ని ఎంతో మిస్‌ అవుతున్నా. విద్యా శాఖ మంత్రిగా ఆయన ఎనలేని సేవలు అందించారు. ప్రతీ చిన్నారికి మెరుగైన విద్య అందించాలన్నది ఆయన కల. అందు కోసం విద్యా ప్రమాణాలు మెరుగుపర్చడం, పాఠశాలలు మెరుగైన వసతులతో నిర్మించడం లాంటి ప్రయత్నాలు చేశారు. బహుశా అందుకేనేమో ఆయన్ని ఇవాళ జైలులో పెట్టారంటూ సీఎం కేజ్రీవాల్‌ కన్నీళ్లు పెట్టుకున్నారు.