NRI-NRT

అమెరికా ఉక్రెయిన్‌కు భారీ సాయం….

అమెరికా ఉక్రెయిన్‌కు భారీ  సాయం….

రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌కు మరోసారి తన సాయాన్ని ప్రకటించింది అగ్రరాజ్యం అమెరికా. దీర్ఘకాల ఆయుధ సాయం కింద అదనంగా 17వేల కోట్ల డాలర్లను అందించనున్నట్లు ఆ దేశ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్‌ శుక్రవారం వెల్లడించింది.మరోవైపు నైరుతి రష్యాలోని వొరొనెజ్‌ నగరంలో ఓ ఎత్తైన నివాస భవనంపైకి తాజాగా ఓ డ్రోన్‌ దూసుకొచ్చింది. ఈ ఘటనలో భవనం దెబ్బతింది. దీనికింద మరిన్ని పేట్రియాట్‌ క్షిపణులు, క్షిపణులు, హాక్‌ గగనతల రక్షణ వ్యవస్థ, చిన్నపాటి ప్యూమా డ్రోన్ల కొనుగోలుకు నిధులు అందుతాయి. శతఘ్ని గుళ్లు, లేజర్‌ గైడెడ్‌ రాకెట్లను సమకూర్చుకోవడానికి, శిక్షణ తదితర అవసరాలకూ ఈ సొమ్మును వెచ్చిస్తారు. ఇప్పటివరకు అనేక సార్లు ఉక్రెయిన్​కు ఆర్థిక సాయాన్ని ప్రకటించింది అమెరికా.