NRI-NRT

TANA Women Forum: మరల తెలుపనా…సంతృప్తే మగువ సౌందర్యం

TANA Women Forum: మరల తెలుపనా…సంతృప్తే మగువ సౌందర్యం

సంతృప్తికి మించిన సౌందర్యం ఏ మహిళకి ఉండదని తానా 2023 మహాసభల్లో ఏర్పాటు చేసిన మహిళా ఫోరంలో పాల్గొన్న అతిథులు అన్నారు. సినీ నటి లయ మాట్లాడుతూ సంతృప్తికర జీవనమే బాహ్య సౌందర్యానికి, అంత: ప్రశాంతతకు ఆలంబన అన్నారు. మరల తెలుపనా పాట అద్భుతంగా ఆలపించి అతిథులను ఊలలాడించారు. ప్రతి పండక్కి తన పిల్లలను ఇంట్లో పనులను భాగస్వామ్యం చేయడం ద్వారా వారిని తెలుగు విశిష్టతలకు దూరం కాకుండా ఉంచగలుగుతున్నానని అన్నారు. నందమూరి వసుంధర మాట్లాడుతూ బాలకృష్ణ బిజీ వ్యక్తిగానే గాకా ఇంట్లో విషయాల పట్ల కూడా శ్రద్ధ వహిస్తారని, తమ పిల్లలకు ఆర్థిక స్వాతంత్ర్యంతో పాటు సంస్కృతి సాంప్రదాయలకు సంబంధించిన విషయాలు కూడా బోధిస్తామన్నారు. మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ బాలయ్యను అడగమని ఆమె సరదాగా నవ్వించారు. గాయని సునీత జీవితం పట్ల తన ఆలోచనాధోరణిని పంచుకున్నారు. వ్యోమగామి శిరీష బండ్ల తన తల్లిదండ్రుల తోడ్పాటు వలనే తాను గగనతలానికి ఎగరగలిగానని అందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. మహిళలు ఈ కార్యక్రమానికి పెద్దసంఖ్యలో తరలిరావడం విశేషం. అడ్లూరు శైలజ సమన్వయపరిచిన ఈ కార్యక్రమంలో భాను, శైలజ, కవిత, శ్రీ గురుస్వామి, సుష్మ తదితరులు విజయవంతానికి తోడ్పడ్డారు.