NRI-NRT

సరదాగా సాగిన TCAGT వేసవి వనభోజనాలు

సరదాగా సాగిన TCAGT వేసవి వనభోజనాలు

కెనడాలోని మాల్టన్‌లోని పాల్ కాఫీ పార్క్‌లో గ్రేటర్ టొరంటో ఏరియా తెలుగు సంఘం(TCAGT) ఆధ్వర్యంలో వేసవి వనభోజనాలు ఉత్సాహంగా నిర్వహించారు. దోస పార్టీ, బార్బెక్యూ కార్న్, పిల్లలు, పెద్దలకు ఆటలపోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.

అధ్యక్షుడు శివ ప్రసాద్ యెల్లాల ముప్పై మూడు సంవత్సరాలుగా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రస్తావించారు. కార్యదర్శి ప్రవళిక కూన ఏర్పాట్లు సమీక్షించారు. మాజీ ఛైర్మన్ సూర్య బెజవాడ తన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పార్లమెంట్ సభ్యులు దీపక్ ఆనంద్, దీపికా దామెర్లలు హాజరయ్యారు. భోజనంలో వివిధ రకాల వంటకాలు అలరించాయి. కోశాధికారి తేజ వఝా, ధర్మకర్తల మండలి దేవి చౌదరి, మాజీ అధ్యక్షులు రాజేష్ విస్సా, అనిత బెజవాడ, మధు చిగురుపాటి, పద్మిని, శ్రీవాణి, శరత్, రాజీవ్, సూరజ్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.