Devotional

రేపటి నుంచి అన్నవరంలో ప్లాస్టిక్ నిషేధం

రేపటి నుంచి అన్నవరంలో ప్లాస్టిక్ నిషేధం

కాకినాడ జిల్లా అన్నవరం కొండపై మంగళవారం నుంచి ప్లాస్టిక్‌ను నిషేధించనున్నట్లు ఆలయ ఈవో ఆజాద్‌ తెలిపారు. కొండపై దుకాణాల్లో గాజు, మొక్కజొన్న గింజలతో తయారు చేసే సీసాల్లో మాత్రమే నీటిని విక్రయిస్తారన్నారు. ‘గాజు సీసాలో నీరు (750 ఎంఎల్‌) కూలింగ్‌ ఛార్జీతో కలిపి రూ. 60కి విక్రయిస్తారు. ఖాళీ బాటిల్‌ను దుకాణంలో తిరిగి ఇస్తే రూ. 40 వెనక్కి వచ్చేస్తాయి. మొక్కజొన్న గింజలతో తయారు చేసిన సీసాలో నీటిని రూ. 40 విక్రయించేందుకు అనుమతిచ్చాం. కొండపై పలు ప్రదేశాల్లో జల ప్రసాదం ప్లాంట్లు ఏర్పాటు చేశాం. మూత తెరవని శీతల పానీయాల సీసాలు మాత్రమే కొండ పైకి అనుమతిస్తాం. వీటిల్లో తాగునీటిని తీసుకురాకుండా తనిఖీలు చేస్తాం. వివాహాల సమయంలో కూడా ఈ నిబంధనలు అమలవుతాయి. అతిక్రమిస్తే రూ. 500 జరిమానా విధిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. ఈవోతో సహా, సిబ్బంది అంతా తప్పనిసరిగా ఈ నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.