DailyDose

కుక్క కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడిన వ్యక్తి

కుక్క కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడిన వ్యక్తి

కొంత మందికి తమ పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం ఉంటుంది. వాటిని ప్రాణంగా చూసుకుంటూ ఉంటారు. సొంత మనుషుల్లా చాలా ఆప్యాయంగా చూసుకుంటూ ఉంటారు. వాటికి ఏమైనా అయితే విలవిలలాడిపోతుంటారు. ఎక్కడికి వెళ్లినా వాటిని తమతో పాటు తీసుకువెళుతూ ఉంటారు. వాటికి ఆపద వస్తే ప్రాణాలు పణంగా పెట్టి మరీ కాపాడాలనుకుంటారు. ఒక క్షణం కూడా తమ ప్రాణాల గురించి ఆలోచించరు కొంతమంది. ఎంత మంది వద్దని వారిస్తున్న పెంపుడు జంతువుల కోసం రిస్క్ చేస్తూ ఉంటారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. ఓ వ్యక్తి తన పెంపుడు కుక్క కోసం మంటల్లోకే వెళ్లి తన ప్రాణాలు పణంగా పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ వీడియో ప్రకారం ఓ ఇళ్లు మంటల్లో చిక్కుకొని ఉంటుంది. కొంతమంది ఫైర్ సిబ్బంది ఆ మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇంతలో అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. అతను మంటలు అంటుకున్న ఇంటిలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తాడు. ఫైర్ సిబ్బంది ఎంత వద్దని వారించిన వారి మాట పట్టించుకోడు. లోపల తన కుక్క ఉందని వారికి చెబుతాడు. ఫైర్ సిబ్బంది ఆగమని అరవడం మనం వీడియో వినవచ్చు. మంటలు అంటుకున్న గదిలోకి వెళ్లిన అతనికి ఏమైనా అవుతుందేమో అని అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే కొద్ది సేపటికి కుక్కతో పాటు ఆ వ్యక్తి క్షేమంగా, సురక్షితంగా బయటకు రావడంతో అందరూ ఊపిరి పీల్చకున్నారు. ఇక భయంతో ఆ కుక్క పరిగెత్తడం మనం చూడవచ్చు. అయితే కుక్కను కాపాడే క్రమంలో ఆ వ్యక్తి చేతికి చిన్న గాయం అయ్యింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన వారు ఆ వ్యక్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వ్యక్తికి తన పెంపుడు కుక్క అంటే ఎంత ప్రేమో అని మెచ్చుకుంటున్నారు. మూగజీవి కోసం నీ ప్రాణాల గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. నువ్వు గ్రేట్ అంటూ మరికొంత మంది కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోను ఆరు మిలయన్ల కంటే ఎక్కువ మంది చూశారు. వేల మంది లైక్ చేశారు. పెట్ లవర్స్ కు ఈ వీడియో చాలా బాగా కనెక్ట్ అవుతుంది.