* బ్రైట్ కామ్ గ్రూప్‌పై ముగిసిన ఈడీ సోదాలు
బ్రైట్ కామ్ సంస్థల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు ముగిశాయి. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) ఉల్లంఘన కేసుకు సంబంధించి హైదరాబాద్‌లోని ఐదు చోట్ల సోదాలు నిర్వహించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం తెలిపింది. ఈ సోదాల్లో రూ. 3.30 కోట్ల నగదుతో పాటు.. రూ. 9.30 కోట్లు విలువ చేసే బంగారం, ఇతర వస్తువులను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.బ్రైట్‌కామ్ గ్రూప్ లిమిటెడ్ కార్యాలయాల్లో, కంపెనీ సీఈవో ఎం సురేష్ రెడ్డి, సీఎఫ్‌వో ఎస్‌ఎల్ఎన్ రాజు నివాసాలు, కంపెనీ ఆడిటర్ పి మురళీ మోహనరావు ఇల్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. విదేశాల్లోని అనుబంధ సంస్థల ద్వారా బ్రైట్‌కామ్ గ్రూప్ రూ. 868.30 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించి ఫ్రాడ్ జరిగినట్టుగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నిర్వహిస్తున్న దర్యాప్తు ఆధారంగా ఈడీ ఫెమా ఉల్లంఘనకు సంబంధించిన విచారణను ప్రారంభించింది.ఈడీ విచారణలో బ్రైట్‌కామ్ గ్రూప్ లిమిటెడ్.. ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్లు వెల్లడైంది. అనుబంధ కంపెనీలకు నిధులు మల్లించినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు. నకిలీ పత్రాలు సృష్టించి సెబీ నుంచి సంస్థ లబ్ధి పొందింది. రూ.300 కోట్ల రూపాయల నిధులను అనుబంధ కంపెనీలకు బ్రైట్ కామ్ మళ్లించింది.ఈ సోదాల సమయంలో వివిధ నేరారోపణ పత్రాలు, డిజిటల్ పరికరాలు కూడా ఈడీ అధికారులు రికవరీ చేశారు. మురళీ మోహనరావు నివాసంలో లెక్కల్లో చూపని నగదు, బంగారు ఆభరణాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
* పుల్ బాటిల్ కోసం ఏకంగా తల్వార్ తో హల్ చల్
వరంగల్ లో ఓ వ్యక్తి కిక్కుకోసం చేసిన కక్కుర్తిపని చివరకు అతన్ని కటకటాల పాలు చేసింది.. చూసిన ప్రతి ఒక్కరినీ అవక్కాయ్యేలా చేసింది..పుల్ బాటిల్ కోసం ఏకంగా తల్వార్ తో హల్ చల్ చేశాడు.. బార్ షాప్ లోకి వెళ్లి వీరంగం సృష్టించాడు.. కిక్కు మాట దేవుడెరుగు కటకటాల పాలయ్యాడు. ఈ వెరైటీ సంఘటన వరంగల్ లోని ఇంతేజార్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.. అఖిల బార్ షాపులోకి బార్ షాప్ లోకి తల్వార్ తో ప్రవేశించిన మధు అనేవ్యక్తి హల్ చల్ చేశాడు.. తనకు ఫుల్ బాటిల్ కావాలని డిమాండ్ చేశాడు.తనకు ఫుల్ బాటిల్ ఇస్తావా చేస్తావా అంటూ కొంతసేపు తల్వార్ తో హల్చల్ చేశాడు..కానీ కౌంటర్ లో ఉన్న రంజిత్ అనేవ్యక్తి అతనికి ఫుల్ బాటిల్ ఇవ్వడానికి నిరాకరించాడు.. దీంతో కొంతసేపు వాగ్వాదం జరిగింది.. ఫుల్ బాటిల్ నుండి హాఫ్ కి వచ్చాడు.. హాఫ్ నుంచి కనీసం ఒక క్వాటర్ బాటిల్ ఇవ్వని డిమాండ్ చేశాడు…కానీ క్వార్టర్ ఇవ్వడానికి కూడా కౌంటర్లో ఉన్న వ్యక్తి నిరాకరించాడు.. ఒక దశలో కౌంటర్ మీద ఉన్న హాఫ్ బాటిల్ పట్టుకొని పారివడానికి ప్రయత్నించాడు..కౌంటర్ మీద ఉన్న బాటిల్ పట్టుకొని పరుగులు పెడుతుండగా కౌంటర్లో ఉన్నవ్యక్తి అతన్ని పట్టుకోని ఆ బాటిల్ గుంజుకున్నాడు.. తర్వాత మరోవ్యక్తి వచ్చి అతని చేతిలోని తల్వార్ తీసుకుపోయాడు..ఫుల్ బాటిల్ నుండి పెగ్గు ప్లీజ్ అని బ్రతిమిలాడినా సదరువ్యక్తి కథ అడ్డం తిరిగి కటకటాల పాలయ్యాడు.. నిందితుడు ఇదే ప్రాంతంలో కొబ్బరి బొండాల వ్యాపారం చేస్తుంటాడు.. అతనికి ఈ తల్వార్ ఎక్కడినుండి వచ్చిన అని పోలీసులు ఆరాతీస్తున్నారు.
* పరీక్షలో ఫెయిల్ అయ్యాడని విద్యార్థి ఆత్మహత్య
పరీక్షలో ఫెయిల్ అయ్యాడని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మధురానగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం…మధురానగర్ నివాసి అయిన ద్రితెక్షన్ వర్మ (20) బీటెక్ రెండవ సంవత్సరం చదువు తున్నాడు. అయితే ఇటీవల బీటెక్ రెండవ సంవత్సరం ఫలితాల్లో ద్రితెక్షన్ వర్మ ఫెయిల్ కావటం తో మనస్థాపం చెంది శనివారం తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చుట్టూ పక్కల వాళ్ల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకుని, మృత దేహాన్ని పోస్ట్ మార్డం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
* విశాఖలో మెడికో ఆత్మహత్య
విశాఖపట్నంలో మెడికో ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది.. డాబా గార్డెన్స్ లోని కేరళకు చెందిన మెడికో ప్రాణాలు తీసుకుంది.. లాడ్జి గదిలో ఉరివేసుకొని వేలాడుతున్నట్టు యువతి మృతదేహాన్ని గుర్తించిన లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.. ఇక, లోపల నుంచి గడియ పెట్టుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానం రావడంతో.. లాడ్జ్ నిర్వాహకుల సమాచారంతో తలుపులు విరగ్గొట్టి లోపలికి వెళ్లిన పోలీసులు.. యువతి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.. ఇక, ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు.విశాఖ పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. చైనాలో ఎంబీబీఎస్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న రమేష్ కృష్ణ అనే యువతి ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు.. ఈ ఘటనపై కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు టూటౌన్ పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు.. మలయాళం భాషలో రాసుకున్న సూసైడ్ నోట్ పోలీసులకు లభ్యం అయ్యింది. “జీవితంలో ఓడిపోయానని, తన చావుకు ఎవరూ బాధ్యులు కారంటూ” సూసైడ్ నోట్ లో రాసుకొచ్చింది యువతి.. ఇక, కేసు నమోదు చేసిన పోలీసులు.. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపేందుకు సిద్ధం అయ్యారు.
* మద్యం మత్తులో ఆటోను ఢీకొట్టిన ఇన్స్‌పెక్టర్
ఆయనొక బాధ్యత గల ఆఫీసర్.. అయినా, కానీ.. ఫుల్లుగా తాగాడు.. తగ్గేదేలే అంటూ జాతీయ రహదారిపై దూసుకెళ్లాడు.. కూరగాయల లోడుతో వెళ్తున్న ఆటోను ఢీ కొట్టాడు. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తితో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి.. అయితే, యాక్సిడెంట్ అయిన కాసేపటికీ.. కట్ చేస్తే వాహనం నడిపింది ఓ పోలీసు ఇన్స్‌పెక్టర్ అని తేలింది. ఈ రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. కూరగాయల లోడుతో వెళ్తున్న ఆటోను ఒక వాహనం ఢీ కొట్టిందని.. అందులో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తితో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయయని తెలిపారు.ఐటీ విభాగంలో ఇన్స్‌పెక్టర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ మద్యం సేవించి వాహనం నడపడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు స్థానిక పోలీసులు పేర్కొన్నారు. శ్రీనివాస్ మద్యం మత్తులో కూరగాయల లోడ్‌తో వెళుతున్న ఆటోను ఢీకొట్టగా.. ఈప్రమాదంలో ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయని.. చికిత్స నిమిత్తం గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించినట్లు తెలిపారు.సిఐ వాహనంపై ఆరు ట్రాఫిక్ చలాన్లు డ్రంకెన్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాల్సిన పోలీసులే డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయడం పట్ల పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇన్స్‌పెక్టర్ నడుపుతున్న వాహనంపై ఏకంగా 6 పెండింగ్ చాలాన్లు కూడా ఉన్నాయి. ప్రమాదానికి గురైన కార్ నెంబర్ TS 09 EY 3330. ఈ వాహనం ఓవర్ స్పీడ్ తోపాటు నో పార్కింగ్ చలాన్లు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
* హైదరాబాదీ ఉగ్రవాదులకు 5 ఏళ్ల జైలు శిక్ష
హైదరాబాదీ ఉగ్రవాదులు అబ్దుల్ బాసిత్, అబ్దుల్ ఖాదిర్‌లను దోషులుగా తేల్చి 5 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేస్తూ ఎన్ఐఏ ఢిల్లీ కోర్టు తీర్పును వెలువరించింది. 2018లో వీరిద్దరినీ ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అబుదాబి మాడ్యుల్ ద్వారా పేలుళ్లకు నిందితులు కుట్ర పన్నారని, ఐదేళ్ల జైలు శిక్షతోపాటు ఇద్దరికీ ఎన్ఐఏ కోర్టు రూ. 2 వేల ఫైన్ విధించింది. ఐసీస్ అబుదాబి మాడ్యూల్ కోసం అబ్దుల్ బాసిత్ పని చేశాడని, ఐసీసీ వైపు యూత్‌ను ఆకర్షితులను చేసేందుకు ప్రయత్నించాడని ఎన్ఐఏ తెలిపింది.మరో ఉగ్రవాది అద్నాన్ హుస్సేన్ నుంచి బాసిత్ ఈ కార్యకలాపాలకు నిధులు సమకూర్చాడని, నిధుల ద్వారా యువకులకు వీసా, పాస్ పోర్ట్‌లను బాసిత్ ఏర్పాటు చేశాడని తెలిపింది. 2017లో అబ్దుల్ బాసిత్ ఇంటర్వ్యూ చూసి అబ్దుల్ ఖాదిర్ ఆకర్షితుడయ్యాడని, ఐసీస్ ఐడియాలజీని అబ్దుల్ ఖాదిర్ ప్రమోట్ చేశాడని, అబ్దుల్ బాసిత్ నిర్వహించిన ఐసీస్ ప్రోగ్రామ్స్‌కు అబ్దుల్ ఖాదిర్ హాజరయ్యాడని, దీంతో 2019లో ఇద్దరిపై సప్లమెంటరీ చార్జ్‌షీట్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
* కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం
కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో కూలీలు 8 మంది అక్కడిక్కడే మృతి చెందారు.. జీపులో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.. ఈ ప్రమాదం వయనాడ్ దగ్గర జరిగింది.. కూలీల తో ప్రయాణిస్తున్న జీపు లోయలో పడింది.. ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు… గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రులు టీఎస్టేట్ లో పని చేస్తున్న కూలీలుగా గుర్తించారు.ఈ ప్రమాదంలో జీపు మొత్తం ధ్వంసం అయింది. లోయలో పడిన తాకిడికి జీపు రెండుగా చీలి పోయింది. శుక్రవారం 14 మంది ప్రయాణికులతో వెళ్తున్న జీపు వయనాడ్ సమీపంలోని మనంతవాడిలోని తవిన్ హాల్ గ్రామ పంచాయతీ సమీపంలోని లోయలో పడిపోయింది.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.. రెస్క్యూ టీమ్స్ సాయం తో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం వయనాడ్ ఆస్పత్రికి తరలించారు.ఈ ప్రమాదం లో మృతి చెందిన వారంతా కూడా టీ ఎస్టేట్ కంపెనీలో పని చేస్తున్న కూలీలుగా గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై సీఎం పినరయి విజయన్ స్పందించారు. అటవీశాఖ మంత్రి ఏకే శశీంద్రన్ ను ప్రమాదస్థలానికి వెళ్లాలని ఆదేశించారు. క్షతగాత్రులకు చికిత్సతో పాటు అన్నీ రకాల సాయం చెయ్యాలని తెలిపారు.. ప్రస్తుతం క్షత గాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూన్నారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి
* విజయవాడలో కారు బీభత్సం
విజయవాడలోని బీఆర్‌టీఎస్ రోడ్డులో కారు బీభత్సం సృష్టించింది. కేంద్రీయ విద్యాలయం స్కూల్ వద్ద పిల్లలపైకి దూసుకెళ్లింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి స్కూల్ ఎదురుగా వాహనాలతో పాటు విద్యార్థుల మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. దీంతో గాయపడిన స్కూల్ విద్యార్థులను స్కూల్ సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్‌ను విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఇక, ప్రమాదం జరిగిన స్థలంలో పాఠశాలకు వెళుతున్న విద్యార్థులు చాలామంది ఉన్నారు. అయితే ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.ఈ ఘటనకు సంబంధించి గుణదల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతి వేగంగా కారును నడపడం, ఆపై దానిని కారును నియంత్రించలేకే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్టుగా తెలుస్తోంది.
* రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం
హైదరాబాద్ బొల్లారంలో ఇవాళ తెల్లవారుజామున ఓ పోలీసు సీఐ తప్పతాగి కారు నడిపి వీరంగం సృష్టించారు. ఈ క్రమంలోనే ఎదురుగా వస్తున్న కూరగాయల లోడ్‌తో ఉన్న వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో కూరగాయల లోడ్‌తో వెళ్తున్న వాహన డ్రైవర్ శ్రీధర్‌కు గాయాలయ్యాయి. దీంతో అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.అయితే సీఐ శ్రీనివాస్ ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. డీఎస్పీ ప్రమోషన్ లిస్ట్‌లో కూడా ఆయన పేరు ఉన్నట్టుగా తెలుస్తోంది. సీఐ మద్యం మత్తులో ఉన్నారని.. ఆయనకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయమంటే పోలీసులు తొలుత నిరాకరించారని శ్రీధర్ సంబంధికులు పేర్కొన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కాన్వాయ్‌తో సీఐ వచ్చారన్నారు. దీంతో తాము నిరసనకు దిగామని, రెండు గంటల తర్వాత సీఐకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే.. 210 రీడింగ్ వచ్చిందని పేర్కొన్నారు. సీఐ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, సీఐ శ్రీనివాస్ వాహనంపై ఆరు ట్రాఫిక్ ఉల్లంఘనలు కూడా ఉన్నాయి.
* బాలుడిని డాబా మీదినుంచి తోసేసిన వాలంటీర్
ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో ఓ గ్రామ వాలంటీర్ ఘాతకానికి పాల్పడ్డాడు. తాను సిగరెట్లు తీసుకురమ్మంటే తీసుకురాలేదని ఓ బాలుడిపై దాడి చేశాడు. డాబా పైనుంచి బాలుడిని తోసేశాడు. దీంతో బాలుడి కాలు, చేయి విరిగాయి. తీవ్ర గాయాలతో మంచాన పడ్డాడు. జిల్లాలోని కోరుకొండ మండలంలో ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి బాలుడి తల్లిదండ్రులు, పోలీసులు ఇలా వివరాలు తెలిపారు. కళ్యాణం సతీష్ (23) అని వ్యక్తి కణపూర్ గ్రామానికి చెందినవాడు. అతను గ్రామ వాలంటీర్ గా పనిచేస్తున్నాడు. బాధితుడి పేరు తల్లోజు శశిధర్(12). ఏడో తరగతి చదువుకుంటున్నాడు. ఆగస్టు 11వ తేదీన శశిధర్ రోడ్డుమీద వెడుతుంటే సతీష్ ఆపాడు. తనకు సిగరెట్లు తీసుకురావాలని కోరాడు. అయితే శశిధర్ సతీష్ చెప్పింది వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు.ఇది సతీష్ మనసులో పెట్టుకున్నాడు. ఆ రోజు రాత్రి ఊర్లో బుర్రకథ జరిగింది. అక్కడ శశిధర్, మరో విద్యార్థి సతీష్ కి కనిపించారు, సతీష్ వారిద్దరిని సరదాగా తిరుగుదాం రమ్మంటూ టూ వీలర్ మీద ఎక్కించుకున్నాడు. ఊళ్లో ఉన్న సామిల్లు దగ్గరికి తీసుకువెళ్లాడు. ముగ్గురు కలిసి డాబా మీదకి వెళ్లారు. అప్పటికే అక్కడ బజ్జీలు, మద్యం సీసాలున్నాయి. అక్కడికి వెళ్లిన తర్వాత నేనెవరో తెలుసా? సిగరెట్లు తెమ్మంటే తేవా? అంటూ సతీష్ శశిధర్ ని చావబాదాడు. ఇది చూసి భయపడిన మరో బాలుడు కొట్టొద్దంటూ ప్రాధేయపడ్డాడు. దీంతో ఆ బాలుడుని కూడా కొట్టాడు. అతని దాడి నుంచి ఎలాగో తప్పించుకుని కిందికి దిగి వెడుతుండగా.. వెనకనుంచి సతీష్ శశిధర్ ని గట్టిగా తన్నాడు. ఆ ఫోర్స్ కు శశిధర్ అదుపుతప్పి డాబా మీద నుంచి రోడ్డుపై పడ్డాడు. సతీష్ వారిద్దరిని ఇక్కడ జరిగిన విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. ఆ తర్వాత వారిద్దరిని తన టూ వీలర్ మీదనే ఎక్కించుకొని ఇంటి దగ్గర దింపేశాడు.