Devotional

ఈ వారం మీ రాశి ఫలితాలు

ఈ వారం మీ రాశి ఫలితాలు

హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
✍🏻 (27-08-2023 నుండి 02-09-2023) ✍🏻
🗓 ఈ వారం మీ రాశి ఫలితాలు

🐐 మేషం (27-08-2023 నుండి 02-09-2023)

కార్యసిద్ధి ఉంది. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి.బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాలలో ఆర్థికలాభం పొందుతారు. చేపట్టిన పనులలో ఆటంకాలు, సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఖర్చులు పెరుగుతాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వారాంతంలో మేలు జరుగుతుంది. శ్రీలక్ష్మీ స్తోత్రం చదివితే బాగుంటుంది.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం (27-08-2023 నుండి 02-09-2023)

మనోబలంతో చేసే పనులు ఫలిస్తాయి. సకాలంతో పనులను పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు. కొత్త వస్తువులను సేకరిస్తారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. కొందరి ప్రవర్తన మీకు కాస్త మనస్తాపాన్ని కలిగిస్తుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. మీ మంచితనమే మీ ఎదుగుదలకు మూలం అవుతుంది. ముఖ్య విషయాల్లో సమయస్ఫూర్తితో ముందుకు సాగితే మంచి ఫలితాలు సొంతం అవుతాయి. ఆర్థికంగా శుభకాలంగా కనిపిస్తోంది. శ్రీవిష్ణు సందర్శనం శుభప్రదం.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం (27-08-2023 నుండి 02-09-2023)

అదృష్టవంతమైన కాలం. లక్ష్యాలను చేరుకునే దిశగా ముందుకు సాగండి, సత్ఫలితాలు వస్తాయి. మీకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి అందరి ప్రశంసలను అందుకుంటారు. పెద్దలు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. మరువలేని విజయాలను సొంతం చేసుకుంటారు. ఒక కీలక విషయంలో మీ ఆలోచనాధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభకాలం. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో మీకు అనుకూలమైన నిర్ణయాలు వస్తాయి. సంతోషదాయకంగా కాలం ముందుకు సాగుతుంది. శ్రీలక్ష్మీ సందర్శనం శుభప్రదం.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం (27-08-2023 నుండి 02-09-2023)

ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి.
ముందుచూపుతో వ్యవహరిస్తే సమస్యలు తగ్గుతాయి. ఓర్పు,సహనం అవసరం. ఒక వ్యవహారంలో మీ ఆలోచనలు అందరి ప్రశంసలను అందుకుంటాయి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. అవసరానికి తగిన సాయం అందుతుంది. బంధు,మిత్రులను కలుపుకొనిపోవాలి. ముఖ్య విషయాల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు పనికిరాదు. వారాంతంలో ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. శ్రీలక్ష్మీ ఆరాధన శుభప్రదం.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం (27-08-2023 నుండి 02-09-2023)

వృత్తి,ఉద్యోగాల్లో మధ్యమ ఫలితాలు ఉన్నాయి. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. చేపట్టే పనిలో శ్రమ అధికం అవుతుంది. కీలక వ్యవహారాల్లో తెలివిగా ఆలోచించండి,మంచి జరుగుతుంది. ఆర్థిక విషయాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. మిత్రుల సూచనలు పనిచేస్తాయి. ఎవరితోనూ అభిప్రాయభేదాలు రాకుండా చూసుకోవాలి. నమ్మించి మోసం చేసేవారు ఉన్నారు, జాగ్రత్తగా వ్యవహరించాలి. సూర్యధ్యానం శుభప్రదం.

🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య (27-08-2023 నుండి 02-09-2023)

పట్టుదలతో పనిచేయండి. కార్యసిద్ధి ఉంటుంది. నమ్మకంతో చేసే పనులు వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ముఖ్య విషయాల్లో ఆలోచనలకు పదును పెట్టాలి. ఉత్సాహంగా ముందుకు సాగాలి. ఒక ముఖ్యమైన వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది. చంచలబుద్ధితో వ్యవహరించి అవకాశాలను చేజార్చుకుంటారు.వృథా ప్రయాణాలు చేస్తారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి. బంధువుల అండదండలు ఉంటాయి. గురుధ్యానం శుభప్రదం.
💃💃💃💃💃💃💃

⚖ తుల (27-08-2023 నుండి 02-09-2023)

కార్యసిద్ధి ఉంది. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్నిపెంచుతుంది. మీ బుద్ధిబలంతో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలుగుతారు. చేపట్టిన పనులను పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయగలుగుతారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. ముఖ్య విషయాల్లో ఆటంకాలు ఎదురవకుండా ముందుచూపుతో వ్యవహరిస్తే మేలు జరుగుతుంది. క్రమంగా అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. హనుమత్ సందర్శనం శుభప్రదం.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం (27-08-2023 నుండి 02-09-2023)

గొప్ప శుభకాలం నడుస్తోంది. మీ మీ రంగాల్లో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. మీ అధికార పరిధి పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మన్ననలను అందుకుంటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. చేపట్టిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం వల్ల ఇంటగెలుస్తారు. ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. సూర్యధ్యానం శుభప్రదం.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు (27-08-2023 నుండి 02-09-2023)

అదృష్టకాలం. ప్రారంభించిన పనులు సులువుగా పూర్తవుతాయి. లక్ష్య సాధనలో స్వశక్తినే నమ్మండి. అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో విజయం సాధిస్తారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగండి. ఒక ఇబ్బంది నుంచి బయటపడతారు. మితభాషణం వల్ల శుభం చేకూరుతుంది. విజ్ఞానం వృద్ధి చెందుతుంది. ప్రశాంత జీవితం లభిస్తుంది. ఇంటాబయటా మంచి జరుగుతుంది. ఇష్టదైవాన్ని ధ్యానిస్తే శుభఫలితాలు కలుగుతాయి.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం (27-08-2023 నుండి 02-09-2023)

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. వృత్తి,ఉద్యోగ, వ్యాపారాల్లో జాగరూకతతో వ్యవహరించాలి. శారీరకబలం పెరిగి, కొన్ని కీలక సమయాలలో అవసరం అవుతుంది. అవసరానికి డబ్బు అందుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఒక శుభవార్త వింటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారులు మీకు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. అనవసర కలహం సూచితం. చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు వస్తాయి. నిర్ణయాలలో స్థిరత్వం ఉండదు. నవగ్రహ ధ్యానశ్లోకాలు చదివితే శుభఫలితాలు కలుగుతాయి.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం (27-08-2023 నుండి 02-09-2023)

మిశ్రమకాలం. లక్ష్యాలను సాధించే క్రమంలో ముందడుగు వేస్తారు. శ్రమకు తగిన ఫలితాలు వస్తాయి. ముఖ్య విషయాల్లో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సంబంధ,బాంధవ్యాలను పటిష్టం చేసుకోవడం మంచిది. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఒక శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు అందుతుంది. ఒక వార్త లేదా సంఘటన బాధ కలిగిస్తుంది. వృథా ప్రయాణాలు చేస్తారు. ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. సూర్య ఆరాధన శుభప్రదం.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం (27-08-2023 నుండి 02-09-2023)

చక్కటి ప్రణాళికలతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆనందప్రదమైన కాలాన్ని గడుపుతారు. మీ మీ రంగాల్లో గొప్ప శుభఫలితాలను అందుకుంటారు. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి నుంచి ప్రశంసలు పొందుతారు. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. ప్రారంభించిన పనులలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. ఒక సంఘటన మనస్తాపాన్ని కలిగిస్తుంది. స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. ఇష్టదేవతారాధన మేలు చేస్తుంది.
🦈🦈🦈🦈🦈🦈🦈