రోబో టెక్నాలజీ తో తయారయ్యే పంచ లోహ విగ్రహాలకు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంగా మారుతుంది. ఎంతో మంది ప్రముఖుల విగ్రహాలు ఇక్కడే తయారయ్యాయి. వాటిని దేశ విదేశాలకు వెళ్తున్నాయి. తాజాగా 111 అడుగుల అన్నమయ్య విగ్రహానికి రూపకల్పన జరుగుతోంది. ప్రముఖ శిల్పి ఏకే ఆర్ట్స్‌కి చెందిన పెనుగొండ కరుణాకర్ వడయార్‌కు ఈ బాధ్యతలు అప్ప్గించింది అమెరికాలోని ఇండియన్ కల్చర్ సెంటర్ అండ్ టెంపుల్ సంస్థ. విగ్రహం మొత్తాన్నిపంచ లోహాలతో తయారు చేస్తారు. అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం తర్వాత అదే స్థాయి ఎత్తున్న విగ్రహం ఇదే కానుంది. ముందుగా మట్టితో ఐదు అడుగుల అన్నమయ్య విగ్రహం నమూనాను తయారు చేస్తారు. తరువాత ఆ విగ్రహాన్ని ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి విగ్రహాన్ని తయారు చేస్తారు. విగ్రహం తయారు చేసే ముందు 3 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తామని శిల్పి తెలిపారు.