నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 196వ రోజుకు చేరుకుంది. నేడు ఉమ్మడి కృష్ణ జిల్లా నూజివీడు నియోజకవర్గం నుంచి ధర్మాజీగూడెం వద్ద చింతలపూడి నియోజకవర్గంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోకి లోకేశ్ పాదయాత్ర ప్రవేశించనుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 9 రోజుల పాటు 6 నియోజకవర్గాల్లో 115 కిలో మీటర్ల మేర లోకేశ్ పాదయాత్ర సాగింది. ఇప్పటి వరకు 2,613 కిలోమీటర్ల పాదయాత్ర లోకేశ్ చేశారు. లోకేశ్‌కు పాదయాత్రకు ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు. రహదారులపై బారులు తీరి ఉంటున్నారు. అన్ని గ్రామాల్లో పసుపు జెండాలు రెపరెపలాతున్నాయి. ఎక్కడ చూసినా కనీవినీ ఎరగని రీతిలో స్వాగతాలు.. అడుగడుగునా హారతులు పడుతూ.. జనం యువనేత లోకేశ్‌తో పాదం కలుపుతున్నారు. 196వ రోజైన నేడు వలసపల్లి క్యాంప్ సైట్ నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభం కానుంది. వలసపల్లిలో స్థానికులతో నారా లోకేశ్ సమావేశం కానున్నారు. ధర్మాజీగూడెం, మట్టంగూడెం, సుందర్రావుపేటల మీదుగా సాగనున్న పాదయత్ర రాత్రి బస కేంద్రానికి చేరుకోనుంది.