Politics

విశాఖపట్నంలో కేఏ పాల్ నిరాహార దీక్ష

విశాఖపట్నంలో కేఏ పాల్ నిరాహార దీక్ష

స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. విశాఖలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. లాభాల్లో నడుస్తున్న స్టీల్ ప్లాంట్‌ను అధోగతిపాలు చేసి అదానీకి కారు చౌకగా కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రూ.8 లక్షల కోట్ల విలువైన పరిశ్రమను కేవలం రూ.4 వేల కోట్లకు తన మిత్రుడికి అప్పగించాలనే ప్రధాని మోదీ ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సఫలం కానివ్వబోమని తేల్చి చెప్పారు.‘‘స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ హైకోర్టు, సుప్రీంకోర్టులో తాను పిటిషన్‌లు వేసినా.. కొందరు వ్యక్తులు ముందుకు సాగనివ్వడం లేదు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఏపీని అన్ని విధాలా దోచుకునేందుకు ప్రయత్నిస్తోంది. మోదీకి వత్తాసు పలుకుతూ ఇక్కడి పార్టీల నేతలు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. కోర్టు నాకు అవకాశం ఇస్తే రూ.లక్షల కోట్లు విరాళాలు తెచ్చి స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవడంతో పాటు 10 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తా. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేస్తామని కేంద్రం ప్రకటించే వరకు నా దీక్ష కొనసాగిస్తా’’ అని కేఏ పాల్‌ స్పష్టం చేశారు.